Tv Serials : బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఎక్కడ ప్రసారమయ్యే సీరియల్స్లలోని హీరోయిన్లకు సినిమాలకన్నా ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో సీరియల్ హీరోయిన్లు కొత్తవాళ్లు వచ్చే కొద్ది పాత వాళ్లకు డిమాండ్ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో సీరియల్స్ కి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు మళ్లీ గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆ వార్తలు పై ఏ సీరియల్ హీరోయిన్ కూడా స్పందించిన సందర్భాలు అయితే కనిపించలేదు కానీ ఇప్పుడు మరో హీరోయిన్ గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?ఆమె చేసిన సీరియల్స్ ఏంటి?అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. వీళ్లు నటించిన సీరియల్స్ కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ మధ్య కొత్త సీరియల్స్ ప్రారంభమవుతున్న కొత్త హీరోయిన్లు కూడా వాటితో పాటు ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో హీరోయిన్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి ఉండడం విశేషం. అలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాగా పాపులారిటీని సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో ఐశ్వర్య పిస్సే ఒకరు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో అగ్నిసాక్షి సీరియల్ తో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తపై చర్చలు జరుగుతున్నాయి. మరి ఈమె నిజంగానే సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుందా లేదా అన్నది క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోయిన్లలో ఐశ్వర్య ఒకరు. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా గుడ్ బై చెప్పబోతుంది అని టాక్ వినిపిస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.. ఇకపోతే ఈమె సీరియల్స్ విషయానికి వస్తే అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత ఆమెకు కస్తూరి సీరియల్ మంచి క్రేజ్ ని అందించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ జీ తెలుగులో ప్రసారమవుతున్న ముక్కుపుడక సీరియల్ లో నటిస్తుంది. ఈమధ్య ఈ సీరియల్ స్టోరీ సరిగ్గా లేదు అని శుభం కార్డు పడబోతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. మరి నిజంగానే ఐశ్వర్య సీరియల్స్ కి గుడ్ బై చెప్తుందా లేదా కొత్త సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇస్తుందో చూడాలి..
Also Read :‘కింగ్ 100 ‘ అప్డేట్.. టబు బర్త్ డే సర్ప్రైజ్.. పూనకాలు పక్కా..!