E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ‘కత్తి లాంటి ఐడియా’ వీడియో వైరల్!

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ‘కత్తి లాంటి ఐడియా’ వీడియో వైరల్!
Advertisement

Venkatesh Kalyan Ram: టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్ కాంబినేషన్‌కు తెరలేచింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. #VenkyAnil5, #NKRAR2 వర్కింగ్ టైటిల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ప్రమోషనల్ వీడియో తాజాగా విడుదలైంది. “కత్తి లాంటి ఐడియా” పేరుతో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-నెట్టింట వైరల్‌గా మారిన జాన్వీ కపూర్ ‘నైట్‌సూట్’ పిక్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా?

సరదా సంభాషణలతో

Advertisement

ఈ ప్రమోషనల్ వీడియోలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ అనిల్ రావిపూడి గత చిత్రాల మేకింగ్ స్టైల్‌పై సరదాగా చర్చించుకుంటూ కనిపించారు. అనిల్ తన సినిమాల్లో హీరోలను ఇసుకలో పాతిపెట్టే సీన్స్ పెడతాడని, ఈసారి తమ పరిస్థితి ఏంటో అని వారు మాట్లాడుకుంటుండగా.. అనిల్ రావిపూడి తలకు తలపాగా చుట్టుకుని, చేతిలో పెద్ద కత్తితో మాస్ ఎంట్రీ ఇస్తారు. ఈ చిత్రానికి ఒక “కత్తి లాంటి ఐడియా” కావాలని ఆయన అడగ్గా, వెంకటేష్ సరదాగా ఆ కత్తితోనే అనిల్ చేతికి చిన్న గాయం చేసి, రక్త తిలకం దిద్ది ఒక క్రేజీ ఐడియాను ఇస్తారు.

రక్తపాతం లేదు.. కేవలం ‘నవ్వుల కోలాటం’

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, చేతిలో కత్తులు పట్టుకుని అనిల్ రావిపూడి కనిపించినప్పటికీ.. ఈ సినిమా హింసకు దూరంగా ఉంటుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, సినిమాలో ఎలాంటి రక్తపాతం ఉండదని, కేవలం థియేటర్లలో “నవ్వుల కోలాటం” మాత్రమే ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Read also-‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ జీవి కూడా ఈ వీడియోలో సందడి చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే (జూన్ 22, 2026) ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు గ్లింప్స్ ముగింపులో అధికారికంగా వెల్లడించారు. ఎఫ్‌-2, ఎఫ్‌-3 చిత్రాల తర్వాత వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పాటు, కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

ఇండియన్ ఫేవరెట్ సూపర్‌హీరో ఈజ్ బ్యాక్.. తేజ సజ్జ ‘హనుమాన్’ 3D ట్రైలర్ విడుదల!

నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. ఓటర్ ఐడీల వివాదంలో నాన్-బెలెబుల్ వారెంట్!

బాక్సాఫీస్ పెహల్వాన్ ‘పెద్ది’.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ఎప్పుడంటే!

నెట్టింట వైరల్‌గా మారిన జాన్వీ కపూర్ ‘నైట్‌సూట్’ పిక్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా?

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్ చరణ్, క్లిన్ కారా..

బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ ఎంతంటే?

‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

Big Stories

×