SHG: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్వయం సహాయక మహిళా గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ) – స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు – వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏపీ, విజయవాడలో ప్రధాన కార్యాలయం కలిగిన రాష్ట్ర స్థాయి అపెక్స్ సహకార సంస్థ స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs)- స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ విధానంలో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 170
ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ : 170 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి ఉండాలి. మైక్రో ఫైనాన్స్, రూరల్ డెవలప్ మెంట్ రంగాల్లో ఎక్స్ పీరియన్స్ ఉండడం మంచిది. అభ్యర్థులు ఏపీ నివాసితులై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల జీతం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 7
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 18
ఈ ఉద్యోగం చేయాలంటే.. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి. .
అఫీషియల్ వెబ్ సైట్: https://www.sthreenidhi.ap.gov.in/SNBank/UI
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల జీతం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Prasar Bharati: అద్భుతమైన అవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. సైఫండ్ ఇచ్చి ఉద్యోగం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 170
దరఖాస్తుకు చివరి తేది: జులై 18