Vishnu – Fish Venkat health: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఫిష్ వెంకట్(Fish Venkat) ఇటీవల అనారోగ్య సమస్యలకు గురి అవుతూ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడటమే కాకుండా తన రెండు కిడ్నీలు కూడా పాడవడంతో వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఫిష్ వెంకట్ అనారోగ్యం విషమంగా మారడంతో ఈయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
విషమంగానే ఫిష్ వెంకట్ ఆరోగ్యం…
ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెంటనే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్టు తెలిపారు .దీంతో ఆయన భార్య ఎవరైనా తన భర్త చికిత్స కోసం సహాయం చేయాలని వేడుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రభాస్(Prabhas) పిఏ ఫోన్ చేసి అండగా ఉంటానని చెప్పినట్లు ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. అయితే అది ప్రభాస్ అసిస్టెంట్ వద్ద నుంచి వచ్చింది కాదని ఫేక్ కాల్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గబ్బర్ సింగ్ కమెడియన్స్(Gabber Singh Movie Comedians) హాస్పిటల్ కి వెళ్లి తనని పరామర్శించినట్టు తెలుస్తోంది.
వెంట్రుకంత సాయం చేయ్యలేరా విష్ణు..
ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ కమెడియన్స్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ.. ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మేం పిలుస్తున్న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా సహాయం చేసి తనని కాపాడాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. అదేవిధంగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణుని కూడా సహాయం చేయాలని కోరారు. ఇటీవల మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమా(Kannappa Movie) సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం వెంట్రుకంత సహాయం చేయలేరా విష్ణు అన్నా, మోహన్ బాబు గారు అంటూ సహాయం కోరారు.
ప్రభుత్వం సాయం చేయాలి…
ఇకపోతే ఫిష్ వెంకట్ ఆరోగ్య విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సహాయం చేయమని కోరారు రేవంత్ రెడ్డి(Revanth Reddy)గారిని కలిసే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని మీడియా ద్వారా ఆయనకు ఈ సమాచారాన్ని అందవేసి సాయం చేయాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కూడా ఈ సందర్భంగా సాయం చేయమని వేడుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో రెండు లక్షలు ఇచ్చారని ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి బహుశా ఆయనకు తెలియకపోయి ఉండవచ్చు అంటూ గబ్బర్ సింగ్ కమెడియన్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయని తెలుస్తోంది.
Also Read: థియేటర్‌లో డబ్బుల వర్షం.. నిర్మాత మిత్రా శర్మ ప్రకటన, తొక్కిసలాట జరిగితే?