Regena Cassandra: రెజీనా కసాండ్రా.. శివ మనసులో శృతి (SMS) అనే చిత్రం ద్వారా 2012లో తెలుగు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్తజంట’ వంటి సినిమాలలో నటించి, తన పాత్రలతో మంచి గుర్తింపు అందుకుంది. 1988 డిసెంబర్ 13 తమిళనాడు చెన్నైలో జన్మించిన ఈమె.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. ఇక ఏడాది తమిళ్లో ‘విదాముయార్చి’ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. అటు హిందీలో జాట్, కేసరి చాప్టర్ 2 వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.
పెళ్లి పై ఊహించని కామెంట్ చేసిన రెజీనా..
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా వివాహానికి మాత్రం దూరంగానే ఉంది. ఈమె తోటి నటీనటులంతా వివాహాలు చేసుకుని, పిల్లలకు కూడా జన్మనిస్తుంటే.. ఈమె మాత్రం పెళ్లికి దూరంగా ఉండటంపై అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని తెగ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అటు అభిమానులకు, ఇటు నెటిజన్స్ కి ఊహించని కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మీకు 34 ఏళ్ళు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. పెళ్లి గురించి మా అమ్మే నన్ను అడగదు. మీరు ఎందుకు అడుగుతున్నారు. అయినా నా పెళ్లి గురించి మీకెందుకు” అంటూ గట్టి సమాధానం ఇచ్చింది రెజీనా. ఇకపై పెళ్లి కంటే ఫ్రెండ్షిప్ బెటర్ అని చెప్పుకొచ్చింది.
ఎఫైర్ రూమర్స్ తో విసిగిపోయిన రెజీనా..
ఇకపోతే రెజీనా ఇప్పుడు వివాహానికి తొందరెందుకు అంటుంది. కానీ గతంలో భారీ స్థాయిలో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యంగ్ హీరో సందీప్ కిషన్ తో రిలేషన్ లో ఉంది అంటూ లివింగ్ రిలేషన్ చేస్తోంది అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సందీప్ కిషన్ కూడా స్పందించారు. తాను ఒక మంచి స్నేహితురాలు అని, అసలు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రూమర్స్ ఇతడితో మాత్రమే ఆగిపోలేదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కూడా ఈమె ఎఫైర్ నడుపుతోందని, త్వరలోనే మెగా కోడలు కాబోతోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇందులో కూడా నిజం లేకపోయింది. ఇక ఇలా రోజుకొక వార్త వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రెజీనా.
రెజీనా నుంచి రాబోయే సినిమాలు..
ఇకపోతే ప్రస్తుతం రెజీనా ఒకవైపు బుల్లితెర ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ఢీ 20 కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూనే.. మరొకవైపు నయనతార (Nayanthara)లేడీ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ లో నటిస్తోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్, పార్టీ, బోర్డర్, కల్లా పార్ట్ వంటి తమిళ్ చిత్రాలలో నటిస్తోంది. అలాగే మలయాళంలో మారీచికా సినిమాతో పాటు హిందీలో సెక్షన్ 108 అనే సినిమాలో కూడా నటిస్తోంది.
ALSO READ:Mitraaw Sharma: మిత్రా శర్మ గొప్ప మనసు.. వికలాంగుడి కష్టానికి చలించి భారీ సాయం, మన హీరోలు వేస్ట్!