E-Paper
Advertisement

Telangana High court Jobs: హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు

Telangana High court Jobs: హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు
Advertisement

Telangana High court Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ముఖ్యంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు గోల్డె ఛాన్స్. తెలంగాణ హైకోర్టు పరిధిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవ ప్రదమైన జీతం లభిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్, టైపిస్ట్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదిన దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1673

ఇందులో వివిధ విభాగాల్లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ హైకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

తెలంగాణ హైకోర్టు పరిధిలో..

కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్- 12
కంప్యూటర్ ఆపరేటర్ – 11
అసిస్టెంట్స్- 42
ఎగ్జామినర్ – 24
టైపిస్ట్- 12
కాపీయిస్ట్- 16
సిస్టెమ్ అనాలిస్ట్-20
ఆఫీస్ సబార్డినేట్స్ – 75

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ పరిధిలో.. 

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 – 45
టైపిస్ట్-66
కాపీయిస్ట్- 74
జూనియర్ అసిస్టెంట్- 340
ఫీల్డ్ అసిస్టెంట్- 66
ఎగ్జామినర్ -51
రికార్డ్ అసిస్టెంట్- 52
ప్రాసెస్ సర్వర్- 130
ఆఫీస్ సబార్డినేట్ – 479

విద్యార్హత: టెన్ట్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 8

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 31(ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.)

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్,  సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 ఉంటుంది.)

నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్న అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://tshc.gov.in/

పరీక్షలు ఏప్రిల్, జూన్ నెలలో జరిగే అవకాశముంది. ఫలితాలు నవంబర్ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది.

టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.

Also Read: Relationship Manager Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో HDFCలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ముఖ్యమైనవి:

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 31(ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది)

దరఖాస్తు ఫీజు: రూ.600 ఉంటుంది.(SC, STలకు రూ.400 మాత్రమే)

వయస్సు: 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.(ఓబీసీ మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు పదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది)

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×