BigTV English

Taja Lakshmi: దేవుడా.. నటి ఊర్వశి కూతురిని చూశారా.. హీరోయిన్ రేంజ్ లో ఉందిగా

Taja Lakshmi: దేవుడా.. నటి ఊర్వశి కూతురిని చూశారా.. హీరోయిన్ రేంజ్ లో ఉందిగా

Taja Lakshmi:  తెలుగు ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు. అది ఇప్పుడు వచ్చింది కాదు మొదటి నుంచి అంతే. తమిళ్ అయినా.. మలయాళం అయినా.. కన్నడ అయినా.. తెలుగువారికి ఒక పాత్ర ద్వారా దగ్గర అయితే వారు తెలుగువారి కిందనే  లెక్క. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారందరూ తెలుగువారు కాకపోయినా.. అంతకుమించి ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడే కాదు అలనాటి హీరోయిన్లు కూడా అంతే. ఇక అలా తమిళ్ నటి అయినా కూడా తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు ఊర్వశి.  ఆమె అసలు పేరు కవితా రంజని.


బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి.. ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోయిన్  గా మారకా.. తెలుగులో చిరంజీవి సరసన  కూడా నటించి మెప్పించింది. ఆయన నటించిన రుస్తుం సినిమాలో హీరోయిన్ గా ఊర్వశి నటించింది. ఆ తరువాత యమకింకరులు, సందడే సందడి లాంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా సందడే సందడి సినిమాలో జగపతి బాబు భార్యగా..  బొండం అనే పాత్రలో ఆమె నటన అద్భుతం.

హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఊర్వశి.. 2000 మే 2న సినిమా నటుడైన మనోజ్ కె జయన్ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కూమర్తె. ఆమె పేరే తేజ లక్ష్మి. అయితే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తడంతో  విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత  ఊర్వశి చెన్నైకి చెందిన బిల్డర్ శివప్రసాద్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఊర్వశి మందుకు బానిసగా మారింది. దానివలన ఆమె ఎన్నో విమర్శలను అందుకుంది.


Nitya Shetty: దేవుళ్లు సినిమా చిన్నారి.. వామ్మో బీచ్ ఒడ్డున అందాలను ఆరబోస్తూ కవ్విస్తుందే

ఇక ఇదంతా పక్కన పెడితే.. రీఎంట్రీలో కూడా ఊర్వశి.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలతో బిజీగా మారింది. ఆడవాళ్లకు మాత్రమే, ముఖ్యంగా ఆకాశం  నీ హద్దురా సినిమాలో సూర్యకు తల్లిగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఊర్వశి కూతురును కూడా సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. ఇక తేజ లక్ష్మీ అచ్చు తల్లి పోలికలతో కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోషూట్స్ చేస్తూ.. కుర్రకారుకు గుబులు పుట్టిస్తూ ఉంటుంది.

మోడ్రన్ డ్రెస్ ల్లో అయినా.. చీరకట్టులో అయినా హీరోయిన్ కు ఈ మాత్రం తీసిపోదు  తేజ లక్ష్మి. ఎప్పటినుంచో ఊర్వశి.. కూతురును  హీరోయిన్ గా ఎంట్రీ  ఇవ్వడానికి  చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. అన్ని సెట్ అయితే తేజ లక్షి ఎంట్రీ ఈ ఏడాదిలోనే ఉంటుందని టాక్. ఇక తేజ తల్లితో ఎలా అయితే క్లోజ్ గా ఉంటుందో తండ్రితో కూడా అంతే క్లోజ్ గా ఉంటుంది. ఆమె ఇద్దరు తమ్ముళ్లను  అంటే.. ఊర్వశి రెండో భర్త కొడుకును.. తండ్రి మనోజ్ రెండో పెళ్లి కొడుకును కూడా సొంత తమ్ముళ్ళగానే చూస్తూ ఉంటుంది. మరి ఈ ఏడాదిలో తేజ లక్ష్మి ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×