E-Paper
Advertisement

BARC Recruitment 2026: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్.. BARC‌లో ఉద్యోగాలు, నోటిఫికేషన్ పుల్ డీటైల్స్ ఇవే..

BARC Recruitment 2026: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్.. BARC‌లో ఉద్యోగాలు, నోటిఫికేషన్ పుల్ డీటైల్స్ ఇవే..
Advertisement

ముంబయిలోని బాబా అణు పరిశోధనా కేంద్రం (BARC) ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ అణు ఇంధన విభాగంలో పనిచేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 2వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

వెకెన్సీ వివరాలు.. 

Advertisement

మొత్తం 61 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వెల్డర్, కార్పెంటర్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి పలు ట్రేడులలో శిక్షణ ఇవ్వనున్నారు.

విద్యార్హత.. 

Advertisement

అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ మెషిన్ కమ్ ఆపరేటర్, టర్నర్, మెషిన్ టూల్ మెయింటనెన్స్ విభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. డ్రాట్స్‌మ్యాన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ మెకానిక్, మెకట్రానిక్స్, మోటార్ వెహికల్ ట్రేడుల అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు అవుతారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు, ఐటీఐ స్కోరును పరిగణనలోకి తీసుకుని జాబితా రూపొందిస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

స్టైఫండ్.. 

ఎంపికైన వారికి నెలకు స్టైపెండ్ రూపంలో గౌరవ వేతనం అందుతుంది. వెల్డర్, కార్పెంటర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ మెషిన్ కమ్ ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,574 చెల్లిస్తారు. మిగిలిన ట్రేడుల అభ్యర్థులకు నెలకు రూ.20,896 స్టైపెండ్ లభిస్తుంది.

దరఖాస్తు విధానం.. 

అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ధ్రువపత్రాలను జాగ్రత్తగా అప్‌లోడ్ చేయడం ముఖ్యం. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు పరిగణించరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అణు శక్తి రంగంలో ప్రాథమిక అవగాహన పెంచుకోవడానికి ఇది అవకాశం అని అధికారులు చెబుతున్నారు.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://barc.gov.in/ 

ALSO READ: NTPC: ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం, దరఖాస్తు చేసుకున్నారా..? 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×