E-Paper
Advertisement

BECIL: రూ.1,00,000 జీతంతో ఉద్యోగాలు బ్రో.. అద్భుతమైన అవకాశం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BECIL: రూ.1,00,000 జీతంతో ఉద్యోగాలు బ్రో.. అద్భుతమైన అవకాశం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 154 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్ (AE), సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వంటి సాంకేతిక, పరిపాలనా విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి చీఫ్ డైటీషియన్, సీనియర్ డైటీషియన్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-1, చైల్డ్ సైకాలజిస్ట్, కోడింగ్ క్లర్క్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు అటెండెంట్, హెల్త్ ఎడ్యుకేటర్, డ్రెస్సర్, మెకానిక్, మేనేజర్, లీగల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ఎంటీఎస్ (MTS) వంటి పోస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు.. 

పోస్టును బట్టి అభ్యర్థులు పదో తరగతి (10th), ఇంటర్మీడియట్, ఐటీఐ (ITI), డిప్లొమా, బీఎస్సీ (B.Sc), సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) డిగ్రీ, లేదా పీజీ (PG) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా అర్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం (Work Experience) కూడా తప్పనిసరి.

జీతం, ఉద్యోగ ఎంపిక విధానం.. 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 17,000 నుండి గరిష్టంగా రూ. 1,00,000 వరకు వేతనం అందుతుంది. ఎంపిక ప్రక్రియ ప్రధానంగా అభ్యర్థుల ప్రతిభ, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహించబడుతుంది.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 295 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (PwBD) ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. భర్తీ చేసిన దరఖాస్తులను ‘బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బీఈసీఐఎల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307, ఉత్తర్‌ప్రదేశ్’ చిరునామాకు ఫిబ్రవరి 18, 2026 లోపు చేరేలా పంపాలి.

ALSO READ: C-DAC Recruitment: డిగ్రీ అర్హతతో 805 ఉద్యోగాలు.. గోల్డెన్ అపార్చునిటీ, నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×