E-Paper
Advertisement

రూ.1,20,000 జీతంలో జాబ్స్.. ఈ వయస్సు మించరాదు, జస్ట్ ఇంటర్వూతోనే ఉద్యోగం బ్రో

రూ.1,20,000 జీతంలో జాబ్స్.. ఈ వయస్సు మించరాదు, జస్ట్ ఇంటర్వూతోనే ఉద్యోగం బ్రో
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. బీఈఎమ్ఎల్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థ టూలింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 10 అసిస్టెంట్ ఇంజనీర్ (గ్రేడ్-1) పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, తదితర అంశాల గురించి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10

Advertisement

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టూల్ లేదా డై మేకింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 39 ఏళ్లు వయస్సు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.

Advertisement

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం అందుతుంది. దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 2026 మే 3వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bemlindia.in/

ALSO READ: డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×