bsf constable recruitment 2024: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది శుభవార్త. హోం మినిస్ట్రీ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 275 (కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్(స్పోర్ట్స్ కోటా)లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.)
క్రీడాంశాలు: ఫుట్ బాల్, ఈక్వెస్ట్రియన్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ,జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, పెన్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: మెట్రిక్యులేషన్ పాస్‌తో పాటు నేషనల్/ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సంబంధిత స్పోర్ట్స్‌లో పాల్గొని ఉండాలి. విజయాలు సాధించి ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్ట్ విధానం: అప్లికేషన్స్ షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, డాక్యుమంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారం చేసుకోని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.147.20(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.)
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2024 డిసెంబర్ 30
Also Read: Cochin Shipyard Jobs: ఐటీఐతో జాబ్స్.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్
ముఖ్యమైనవి:
ఉద్యోగాలు: 275(స్పోర్ట్స్ కోటాలో మాత్రమే)
వయస్సు: 23 మించరాదు
దరఖాస్తు: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
లాస్ట్ డేట్: డిసెంబర్ 30