Dil Raju: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజెర్. సంక్రాంతి కానుక ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయాల్సి ఉంది కానీ సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను జనవరి కి షిఫ్ట్ చేశారు. ఇదే డేట్ కి రావలసిన విశ్వంభర సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను అమెరికాలో జరిపారు. అమెరికాలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దర్శకుడు సుకుమార్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడిన మాటలు సినిమా మీద మరింత హైప్ పెంచాయి. సుకుమార్ మాట్లాడుతూ రంగస్థలం సినిమాకు రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్నాను. కానీ రాలేదు. ఈ సినిమా నేను చిరంజీవి గారితో పాటు కలిసి చూసాను. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటన చూసి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ సినిమా. మామూలు సీజన్ లో కంటే సంక్రాంతి సీజన్ లో ఒక సినిమాకి వచ్చే డిమాండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు వచ్చే మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. రీసెంట్గా విజయవాడలో అతిపెద్ద భారీ కట్ అవుట్ ను రాంచరణ్ కు ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ను ఏర్పాటు చేసేటప్పుడు నిర్మాత దిల్ రాజుకి ఆరోజు మీరు రావాలి అని ఆహ్వానించారు ఆ కటౌట్ ని నిర్వహించిన వాళ్ళు. ఈరోజు ఆ ఈవెంట్ కు దిల్ రాజు హాజరయ్యారు. దిల్ రాజు ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ కేవలం కటౌట్ ఓపెనింగ్ అని మాత్రమే రాలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా వచ్చాను అంటూ తెలిపారు. అమెరికాలో అంత భారీగా ఈవెంట్ జరిగిన తర్వాత అంతకుమించి ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్ జరగాలి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ బట్టి ఈవెంట్ ప్లానింగ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది అంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ జనవరి 1న విడుదల కానుంది. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయ్యే ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అవగాహన రానుంది. మొత్తానికి ఈ సినిమా మీద మాత్రం చిత్ర యూనిట్ వెరీ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుంది అనేది జనవరి 10న తెలియనుంది.
Also Read : Dil Raju on Game Changer: గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు