CBSE Board: ఇటీవల కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కువగా సీబీఎస్ఈ సిలబస్ ఉన్న స్కూళ్లలోనే చదివిస్తున్నారు. స్టడీ నాణ్యతగా ఉంటుందని పేరెంట్స్ భావించి.. ఎక్కువగా సీబీఎస్ఈ స్కూళ్లలో అడ్మిట్ చేయిస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్ ను చదవడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే కొంచెం ఫీజులు ఎక్కువైనా ఆ స్కూళ్లలోనే చదివిస్తున్నారు. అయితే తాజాగా టెన్త్ పరీక్షలకు సంబంధించి సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
2026 ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి ఏడాదికి రెండు సార్లు టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి – మే నెలల్లో ఈ పరీక్షలు ఉంటాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. మొదటి దశలో ఎగ్జామ్ కి హాజరు కావడం తప్పనిసరి అని చెప్పింది. రెండో దశలో పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్‌ఈ స్పష్టతనిచ్చింది.
ALSO READ: ECIL: మంచి అవకాశం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, డోంట్ మిస్
ఎగ్జామ్ రిజల్ట్స్ ను వరుసగా ఏప్రిల్, జూన్‌లలో ప్రకటించనున్నారు. అయితే.. రెండు ఎగ్జామ్ లకు అటెండ్ అయిన విద్యార్థుల నుంచి మంచి మార్కులతో పరిగణలోకి తీసుకుంటామని బోర్డు ప్రకటించింది. దీంతో సీబీఎస్ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీని వల్ల విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గనుంది. రెండు దశల్లో ఎగ్జామ్ లు ఉండటం వల్ల.. ఒకసారి కాకపోతే.. మరో దశలో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు భావించింది.
ALSO READ: MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..
ఈ విధానం వల్ల విద్యార్థులకు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు, పరీక్ష ఒత్తిడిని తగ్గించి, మెరుగైన ఫలితాలను సాధించేందుకు తోడ్పడుతోంది. ఈ మార్పు 2026 విద్యా సంవత్సరం నుండి అమలులోకి రానుంది.