E-Paper
Advertisement

Central Bank of India Jobs: జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు.. అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.86,000

Central Bank of India Jobs:  జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు.. అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.86,000
Advertisement

Central Bank of India Jobs: ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లొ దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి డీటైయిల్డ్‌గా తెలుసుకుందాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 266

ఇందులో మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

ఆన్ లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 21

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 9

2025 మార్చిలో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది.

ఎగ్జామ్ అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.850.(ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది)

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.)

జోన్ల వారీగా వెకన్సీలు:

అహ్మదాబాద్: 123

చెన్నై: 58

గువహటి: 43

హైదరాబాద్: 42

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి 85,920 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:

మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 80 నిమిషాల సమయం కేటాయిస్తారు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు, ఎకానమిక్ సెనారియో అండ్ జనరల్ అవెర్నెస్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నలకు ఒక్కో మార్కు ఉంటుంది.

రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజ్ ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in/en

Also Read: Allu Arjun : కోర్టులు, కేసుల గొడవ వదిలేసి, ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

అర్హత ఉన్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×