Dil Raju : ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇంట్లో ఈ రోజు ఉదయాన్నే ఐటీ అధికారులు సోదాలు (IT Ries) నిర్వహించారు. ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన కుమార్తె హన్సితా రెడ్డి ఇంట్లో సైతం సోదాలు జరిగాయి. తాజాగా ఈ దాడులపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందించారు.
నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటు వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో సైతం ఏకకాలంలో 55 బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాలపై స్పందించిన దిల్ రాజు భార్య తేజస్విని… ఐటీ సోదాలు సాధారణంగా జరిగే సోదాలేనని తెలిపారు. బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు. వీటితో పాటు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని తెలిపారు. ఈ తనిఖీలు సినిమాలకు సంబంధించినవి మాత్రమే అన్నారు.
జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్న దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్ ఇంటిలో సైతం ఈ దాడులు జరిగాయి. ఇక కుమార్తె హన్సిక రెడ్డి ఇళ్లల్లో సైతం సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక దిల్ రాజు భార్య తేజస్విని రెడ్డిని కారులో తీసుకెళ్లిన ఐటీ అధికారులు బ్యాంక్ లాకర్ ఉన్న ఉన్న వాటిని పరిశీలించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లో సైతం తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ పత్రాలను పరిశీలించిన అధికారులు.. ఇతర ఆస్తులకు సంబంధించిన పలు విషయాలపై ఆరా చేపట్టారు.
ఇక ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా ప్రముఖ సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకంగా ఒకే సమయంలో 55 బృందాలు 8 చోట్ల తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బడా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులలో పాటు బంధువుల ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థల్లో సైతం ఈ తనిఖీలు జరిగాయి. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇల్లు, ఆఫీసులో సైతం అధికారులు సోదాలు చేపట్టారు.
ఇక విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం సాధించి రూ.200 కోట్ల క్లబ్ లో చేరే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ.. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కలెక్షన్ల సునామీని సృష్టించింది. పూర్తి ఫ్యామిలీ చిత్రంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. సంచలనం సృష్టించింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం 2025 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలించింది.
ALSO READ : కోర్టులు, కేసుల గొడవ వదిలేసి, ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్