Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గత కొన్ని రోజులుగా వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన కారణంగా ఉక్కిరి బిక్కిరి అయిన అల్లు అర్జున్ ఎట్టకేలకు ఆ వివాదం నుంచి తేరుకున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇట్స్ ఫ్యామిలీ టైం….
‘పుష్ప’ మూవీ అల్లు అర్జున్ కి ఎంత సక్సెస్ ని ఇచ్చిందో, అంతే మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను కూడా ఇచ్చింది. ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో అల్లు అర్జున్ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను రాబట్టాడు. ఫస్ట్ పార్ట్ తో ఏకంగా నేషనల్ అవార్డు అనుకున్నాడు. కానీ ‘పుష్ప 2’ రిలీజ్ కి ముందు ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఓ మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ఆస్పత్రి పాలు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఈ ఘటనకు కారణం అంటూ పోలీసులు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేశారు. ఫలితంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరోజు రాత్రి అంతా జైల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ కొన్ని రోజుల ఎట్టకేలకు కోర్టు బెయిలు మంజూరు చేసి అల్లు అర్జున్ కు ఊరటనిచ్చింది. ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలన్న షరతుకు మినహాయింపు ఇస్తూ, విదేశాలకు వెళ్ళే వెసులుబాటును కల్పించింది.
ఇక ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ ఈ వివాదం నుంచి బయట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వివాదం తర్వాత ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లిన ఫోటోలు వైర్ ల్ అవుతున్నా. అందులో అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హ, కొడుకు అయాన్ అందరూ వైట్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. దీంతో వివాదం నుంచి అల్లు ఫ్యామిలీ బయటపడి, ప్రశాంతంగా ఉందన్న సంకేతం అందినట్టుగా అయ్యింది. కాగా అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితమే తన లుక్ ను మార్చేసిన సంగతి తెలిసిందే.
‘పుష్ప 2’ కలెక్షన్ల ఊచకోత…
1000 కోట్లకు పైగా పీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిన మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2). రూ.620 కోట్ల షేర్, 1250 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే ఏకంగా 294 కోట్లను కొల్లగొట్టింది. దాదాపు నెలరోజుల పాటు ఎదురులేకుండా బాక్స్ ఆఫీస్ ని ఏలిన పుష్పరాజ్… 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించాడు. ఇక ప్రస్తుతం థియేటర్లలో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసిన ‘పుష్ప 2’ రీలోడెడ్ వర్షన్ సందడి చేస్తోంది. కానీ ఇంతటి భారీ సక్సెస్ ను దురదృష్టవశాత్తూ బన్నీ ఎంజాయ్ చేయలేకపోయాడు.