BigTV English

Bigg Boss Nikhil: సింగిల్ అంటూ షాక్ ఇచ్చిన నిఖిల్.. హౌస్ లో చెప్పిందంతా సింపథీ కోసమేనా..?

Bigg Boss Nikhil: సింగిల్ అంటూ షాక్ ఇచ్చిన నిఖిల్.. హౌస్ లో చెప్పిందంతా సింపథీ కోసమేనా..?

Bigg Boss Nikhil: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg boss) ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్లుగా కంటెస్టెంట్స్ ప్రవర్తించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పిలిపించి, షో ని రక్తి కట్టించారు. దాదాపు 15 వారాలపాటు కొనసాగిన ఈ సీజన్లో నిఖిల్ మలయక్కల్ (Nikhil Malayakkal) టైటిల్ విజేతగా నిలిచి, ప్రైజ్ మనీ తో పాటు మారుతి కార్ కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే నిఖిల్ హౌస్ లో ఉన్నంతసేపు తాను.. సీరియల్ సహానటి కావ్య (Kavya)ను ప్రేమించానని, అయితే ప్రస్తుతం కావ్యతో మాట్లాడడం లేదని, కావ్యను వదిలి ఉండలేనని, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన వెంటనే కావ్య దగ్గరకు వెళ్లి తన తప్పుకు క్షమించమని కోరుతాను అని తెలిపారు. అంతేకాదు ఆమె లేకపోతే తన జీవితమే లేదు అన్నట్టు మాట్లాడారు నిఖిల్. దీంతో చాలామంది నిఖిల్ పై సింపథీ చూపించారు. తద్వారా ఆయనకు ఓట్లు కూడా పెరిగాయి. అదే సమయంలో నిఖిల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కావ్య మాత్రం నిఖిల్ చెప్పే మాటలు అబద్ధం, దయచేసి నిజాయితీని మాత్రమే నమ్మండి అంటూ తెలిపింది.


కావ్యపై ప్రేమ అంతా మోసమే..

అయితే ఆ సమయంలో ఎవరూ కూడా కావ్య మాటలు నమ్మలేదు. ఇక హౌస్ లో ఉన్నంతసేపు కావ్యనే తన కాబోయే భార్య అంటూ ఎన్నెన్నో చెప్పిన నిఖిల్ .. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌస్ లో తాను చేసిన వాగ్దానాలు అన్నింటిని కూడా పక్కన పెట్టేశారు. దీనికి తోడు కావ్యాను కలుస్తానని చెప్పారు కదా అని ప్రశ్నించినా కూడా దానిని దాటవేసే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” లో ఏకంగా “తాను సింగిల్.. రెడీ టు మింగిల్” అని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటివరకు కావ్యనే నా సర్వస్వం అన్నావు.. ఇప్పుడేంటి సింగిల్ అని చెప్పి మళ్ళీ మింగిల్ అవ్వడానికి సిద్ధమవుతున్నావు.. నీ కపట ప్రేమతో ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించావు” అంటూ ఫైర్ అవుతున్నారు.


ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేసిన స్టార్స్..

షో విషయానికి వస్తే శ్రీముఖి(Srimukhi) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించే హీరో, హీరోయిన్లను ఈ షోలో తీసుకొచ్చి సందడి చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారిని కూడా ఈ షోకు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే టేస్టీ తేజ (Tasty teja),యశ్మీ గౌడ(Yashmi gouda)కూడా సందడి చేసారు. ఏది ఏమైనా నిఖిల్ మాత్రం సింగిల్ అని చెప్పి ఆడియన్స్ ని ఫూల్స్ చేశారు అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×