E-Paper
Advertisement

Supreme Court Recruitment: డిగ్రీ అర్హతతో కోర్టులో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం, ఇంకెందుకు ఆలస్యం

Supreme Court Recruitment: డిగ్రీ అర్హతతో కోర్టులో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు 5 ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో 1 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ కోర్టు అసిస్టెంట్ కేటగిరీలో 2 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ విభాగంలో 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22

విద్యార్హత:

Advertisement

అభ్యర్థుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా లా (Law), మ్యూజియాలజీ, లైబ్రరీ సైన్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు.

వయస్సు:

విద్యార్హతతో పాటు ఆయా రంగాల్లో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్‌కు నెలకు రూ. 78,800 జీతం అందుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ. 67,700 వేతనం ఇస్తారు. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,600 చొప్పున వేతనం చెల్లిస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

దరఖాస్తు విధానం..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 8వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

ఫీజు వివరాలు..

ఫీజు వివరాలు పరిశీలిస్తే జనరల్ అలాగే ఓబీసీ అభ్యర్థులు రూ. 1,500 చెల్లించాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు రూ. 750 ఫీజుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/

ALSO READ: SBI Clerk: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. 6,589 పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా సిద్ధం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×