CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా వేధిస్తుందనే చెప్పవచ్చు. డిగ్రీలు, బీటెక్ పూర్తి చేసి వేల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు చాలా వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం లేదు. ఇలా డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏలు పూర్తి చేసిన వారు చాలా మంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు.
బీటెక్, ఎంబీఏ, ఎంసీలు పూర్తి చేసి చిన్నా, చితక ఉద్యోగాలు చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. చదివింది ఒక్కటైతే.. చేసే జాబ్ కు సంబంధం లేని వారు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారు వేలల్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వచ్చే కలెక్టర్ల సదస్సులో జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంతో సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే లోగా.. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రతి జోన్ కు ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీ నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని సీఎం అధికారులకు సూచించారు.
నిరుద్యోగులకు ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ కల్పించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఒకవేళ అలా నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు రాగా.. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ కూడా మాట్లాడారు. క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గాల్లో మూడు నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
ALSO READ: JOBS: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకున్నారా..?
ALSO READ: NTPC-NGEL: సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. రూ.11,00,000 జీతం భయ్యా..