BigTV English
Advertisement

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హిట్ డేట్ పట్టేశారుగా!

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హిట్ డేట్ పట్టేశారుగా!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఇది ఒక సోషియో-ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను గతంలో ‘బింబిసార’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.’విశ్వంభర’ చిరంజీవి 156వ సినిమాగా రూపొంతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ వారు మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా సమాచారం.


మరింత వెనక్కి..!

వాస్తవానికైతే.. గత సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ టీజర్‌లో గ్రాఫిక్స్ అవుట్ పుట్ చూసిన తర్వాత కాస్త గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. దీంతో.. చిత్ర యూనిట్ ముందే జాగ్రత్త పడింది. సినిమాను వాయిదా వేసి.. సీజీ వర్క్‌ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ పట్ల మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారట. అయితే.. సంక్రాంతి నుంచి వాయిదా వేసిన ఈ సినిమాను.. 2025 మే 9న విడుదల కావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ తేదీని ఐకానిక్ డేట్‌గా భావించారు. ఎందుకంటే చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా అదే రోజు విడుదలై భారీ విజయం సాధించింది. దీంతో.. విశ్వంభర కూడా అదే రోజు వస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుంది. దీంతో.. మరింత వెనక్కి వెళ్లింది విశ్వంభర.


కొత్త డేట్ ఇదే?

విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మేకర్స్ మరో సాలిడ్ హిట్ డేట్‌ను లాక్ చేసినట్టుగా తెలసింది. మెగాస్టార్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ఇంద్ర రిలీజ్ డేట్ జూలై 24న విశ్వంభర రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది విశ్వంభరకు హిట్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది. ఇప్పటికే ఇంద్ర రీ రిలీజ్ అవగా.. దుమ్ముదులిపేసింది. అయితే.. దీనిపై మేకర్స్ సైడ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ బ్యూటీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయినట్లుగా తెలుస్తోంది. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న విశ్వంభర మెగాభిమానులను, తెలుగు ఆడియెన్స్‌ను ఎలా అలరిస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×