E-Paper
Advertisement

Cochin Shipyard: పదో తరగతి అర్హతతో 260 ఉద్యోగాలు.. నెలకు రూ.23,000 జీతం, ఇంకా 2 రోజులే భయ్యా..

Cochin Shipyard: పదో తరగతి అర్హతతో 260 ఉద్యోగాలు.. నెలకు రూ.23,000 జీతం, ఇంకా 2 రోజులే భయ్యా..
Advertisement

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ (CSL), నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. కేరళలోని కొచ్చి యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 260 వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షిప్పింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ కోరింది.

విభాగాలు, పోస్టుల వివరాలు ఇవే.. 

Advertisement

మొత్తం 260 ఖాళీలను వివిధ ట్రేడుల వారీగా భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రధానంగా..

షీట్ మెటల్‌ వర్కర్‌, వెల్డర్‌, ఫిట్టర్‌

Advertisement

ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, మెషినిస్ట్‌

పెయింటర్‌, ప్లంబర్‌, షిప్‌రైట్‌ ఉడ్

క్రేన్‌ ఆపరేటర్‌, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్

విద్యార్హతల వివరాలు.. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి పదో తరగతి (SSC) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీస పని అనుభవం ఉండటం తప్పనిసరి. సాంకేతిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

వేతనం, వయస్సు వివరాలు..

అభ్యర్థుల వయస్సు 2026 ఫిబ్రవరి 7వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,300 ప్రారంభ వేతనంతో పాటు ఇతర భత్యాలు అందుతాయి. ఒప్పంద కాలపరిమితిలో ప్రతిభ కనబరిచిన వారికి నిబంధనల మేరకు ప్రయోజనాలు ఉంటాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం…

అభ్యర్థుల ఎంపిక కేవలం ప్రాక్టికల్ టెస్ట్ (Practical Test) ఆధారంగానే జరుగుతుంది. రాత పరీక్ష లేకుండా కేవలం అభ్యర్థి యొక్క వృత్తిపరమైన నైపుణ్యాన్ని పరీక్షించి తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు కొచ్చిన్ షిప్‌యార్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

దరఖాస్తు ఫీజు: రూ.300. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు).

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 7..

వెబ్‌సైట్: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://cochinshipyard.in/

షిప్‌యార్డ్ నిర్మాణ పనుల్లో అనుభవం సంపాదించడానికి ఇది ఒక మంచి వేదిక. గడువు ముగిసేలోపు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.

ALSO READ: Supreme Court On TG DGP: తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×