SBI PM-Vidyalaxmi Scheme: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం విద్యార్థులు రెడీ అవుతున్నాయి . చాలామందిని వేధిస్తోంది మనీ సమస్య. చేతిలో డబ్బుల్లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఆ దిగులు అవసరం లేదు. ఎందుకంటే విద్యార్థులకు అండగా పీఎం-విద్యాలక్ష్మి స్కీమ్ ఉండగా ఇక చింత ఎందుకు? అసలు విషయాలు తెలుసుకుందాం.
పిల్లల చదువుల కోసం ఇబ్బంది పడుతున్నారా?
విద్య కోసం డబ్బు అడ్డంకి కాకూడదనే ఆలోచనతో పీఎం-విద్యాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చింది కేంద్రం ప్రభుత్వం. మెరిట్ ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవచ్చు. ఈ పథకం విద్యార్థులకు కొండంత అండ. దేశంలో ఉన్నత విద్య చదువుతున్న మెరిట్ విద్యార్థులకు వర్తించే పథకం హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గుర్తించిన టాప్- 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరినవారికి సువర్ణ అవకాశం.
ఎడ్యుకేషన్ లోన్స్‌ను సులభంగా పొందవచ్చు. గ్యారెంటీ లేకుండా లోన్స్ పొందే చక్కటి అవకాశం. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా రకరకాల బ్యాంకుల్లో అందుబాటులో ఉంది ఈ స్కీమ్. షెడ్యూల్డ్, రీజనల్ రూరల్, కోఆపరేటివ్ బ్యాంకులు ఇందులో భాగంగా ఉంటాయి.
ష్యూరిటీ లేకుండా రూ.7.50 లక్షల లోన్.. ఆ స్కీమ్ ఏంటో తెలుసా?
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాల మేరకు కొలాటరల్ ఫ్రీ- గ్యారెంటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం. అప్లికేషన్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మారటోరియం సమయంలో 3 శాతం వడ్డీ రాయితీ సౌకర్యం. ఏడాదికి గరిష్టంగా ఒక లక్ష మంది విద్యార్థులకు వర్తించనుంది ఈ స్కీమ్.
ఫ్యామిలీ ఆదాయం 8 లక్షల రూపాయల లోపు ఉన్నవారు అర్హులు. 4.5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు వస్తుంది. అయితే లోన్‌పై పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. 7.5 లక్షల రూపాయల వరకు లోనుకు 75 శాతం వరకు క్రెడిట్ గ్యారంటీని ఎన్‌సీజీటీసీ ద్వారా అందిస్తుంది ప్రభుత్వం. మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులకు ఈ స్కీమ్ పని చేయదు.
ALSO READ: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఫస్టియిర్ వాళ్లే ఎక్కువ
3 శాతం వడ్డీ రాయితీ కింద ఏడాదికి లక్ష మంది ఎంపిక అవుతారు. అప్లికేషన్లు ఎక్కువగా వస్తే ప్రాధాన్యత క్రమంలో దాన్ని అమలు చేయనున్నాయి బ్యాంకులు. ప్రభుత్వ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరిన విద్యార్థులకు తొలి అవకాశం. ఆ తర్వాత టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల వారికి ప్రయార్టీ ఉంటుంది.
తొలుత ప్రభుత్వ పాఠశాలో ఇంటర్ వరకు పూర్తి చేసినవారని పరిగణలోకి తీసుకుంటారు. గ్రామీణ ప్రాంత స్కూల్స్, చివరగా అమ్మాయిలకు ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు ఒక అప్లికేషన్ కింద గరిష్టంగా మూడు బ్యాంకులను ఎంపిక చేయవచ్చు. వడ్డీ రాయితీ కోసం అప్లై చేసే అవకాశం ఉంటుంది కూడా.
తొలుత పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ కావాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం నింపి, . అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. మూడు బ్యాంకులను ఎంపిక చేసుకుంటే ఆయా బ్యాంకులు వాటిని ప్రాసెస్ చేస్తాయి.
ఒకవేళ రిజెక్ట్ అయితే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. ఈ స్కీమ్‌లో 3 కోట్ల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. కోర్సు ఫీజులు, ఇన్‌స్టిట్యూషన్ అవసరాల ఆధారంగా లోన్ వస్తుంది. 4 లక్షల లోన్‌పై మార్జిన్ ఉండదు. ఆ తర్వాత 4 నుంచి 7.5 లక్షల వరకు 5 శాతం మార్జిన్ ఉండనుంది. 7.5 లక్షలపై మార్జిన్ అసవరం ఉందని చెబుతున్నాయి. ఒక సంవత్సరం అదనంగా మారటోరియం ఉంటుంది.
ఈ సమయంలో అసలు, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ల వరకు రీపేమెంట్ సమయం ఉంటుంది. ఈఎంఐలు సులభంగా చెల్లించవచ్చు. ఈ లోన్లు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా కోర్సులకు వర్తించనున్నాయి. అప్లికేషన్‌కు 200 రూపాయలతోపాటు జీఎస్‌టీ వర్తించనుంది. ఎస్‌బీఐ ద్వారా తీసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీజు విద్యార్థి ఖాతా నుంచి కట్ అవుతుంది. మిగతా వివరాలకు సదరు బ్యాంకులను సంప్రదించవచ్చు.