Independence Day 2025: ప్రతి సంవత్సరం ఆగస్టు 15న, మనం భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటాము. ఇంతకీ స్వాతంత్ర్య తేదీని ఆగస్టు 15గా ఎందుకు ఎంచుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వాస్తవానికి.. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి 30 జూన్ 1948న స్వాతంత్ర్యం పొందాల్సి ఉంది. కానీ పరిస్థితులు మారడం వల్ల ఆ తేదీని ఆగస్టు 15, 1947గా ప్రకటించారు. ఈ నిర్ణయం వెనక రాజకీయ కారణాలు మాత్రమే కాకుండా.. రెండవ ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ సామ్రాజ్య విఫలం, లార్డ్ మౌంట్‌బాటెన్ వ్యూహం కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి.
స్వాతంత్ర్యం దినోత్సవం:
1929లో లాహోర్ సమావేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ “పూర్ణ స్వరాజ్” ప్రకటించినప్పుడు స్వాతంత్ర్యానికి పునాది పడింది . అంతకుముందు.. మహాత్మా గాంధీ, జిన్నా, తేజ్ బహదూర్ సప్రూ వంటి నాయకులు బ్రిటిష్ వైస్రాయ్ నుంచి పూర్తి స్వాతంత్ర్యం కోరినప్పటికీ.. బ్రిటిష్ ప్రభుత్వం డొమినియన్ హోదా ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉంది. అలా జరిగితే మాత్రం భారతదేశం పరిమిత స్వయం ప్రతిపత్తిని పొందుతుంది. కానీ అది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటుంది. అందుకే దీనిని మన నాయకులు తిరస్కరించారు.
రెండవ ప్రపంచ యుద్ధం:
రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) బ్రిటన్‌ను ఆర్థికంగా బలహీనపరిచింది. యుద్ధం తర్వాత వనరుల కొరత తీవ్రంగా ఉండటం, వలస రాజ్యాలలో పెరుగుతున్న తిరుగు బాట్లు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఇకపై పాలించడం సాధ్యం కాదని భావించేలా చేశాయి. దీని ప్రకారం.. 1946లో ఇండయన్స్ జూన్ 30, 1948 నాటికి విముక్తి పొందాలని నిర్ణయించారు.
మౌంట్ బాటన్ ప్రణాళిక, కొత్త స్వాతంత్ర్య తేదీ:
ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్‌కు అధికార బదిలీ బాధ్యత అప్పగించారు. కానీ పరిస్థితిని చూసి, భారతదేశానికి వీలైనంత త్వరగా స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మౌంట్ బాటన్ 1947 జూన్ 3న ‘మౌంట్ బాటన్ ప్రణాళిక’ను ప్రకటించి.. 1947 ఆగస్టు 15 తేదీని ఖరారు చేశారు. ఈ నిర్ణయంపై దేశ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఆగస్టు 15వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు ?
ఆగస్టు 15వ తేదీని రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన వార్షికోత్సవం (ఆగస్టు 15, 1945) కావడంతో తాను ఆ తేదీని ఎంచుకున్నానని మౌంట్‌బాటన్ తన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తకంలో వివరించాడు. ఆ రోజున జపాన్ చక్రవర్తి హిరోహిటో ద్వారా యుద్ధం ముగిసినట్లు ప్రకటించింది. ఈ తేదీని ఎంచుకోవడం ద్వారా, అధికార బదిలీ తన నియంత్రణలో ఉందనే సందేశాన్ని తెలియజేయడానికి మౌంట్‌బాటన్ ఈ తేదీన మాత్రమే స్వాతంత్ర్యం ప్రకటించాలని అనుకున్నారు.
పాకిస్తాన్ ఆగస్టు 14 నే ఎందుకు ఎంచుకుంది ?
చట్టబద్ధంగా.. ఇండియా, పాకిస్తాన్ రెండూ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందాయి. కానీ పాకిస్తాన్ ఆగస్టు 14ని తన స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించింది. దీంతో పాటు, మౌంట్ బాటన్ రెండు దేశాలలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరు కావడానికి ఆగస్టు 14న పాకిస్తాన్, ఆగస్టు 15న భారతదేశాలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు.
Also Read: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !