BigTV English

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Railway: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే పరధిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటీస్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్… సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,418 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ  ఖాళీల సంఖ్య: 2418


క్లస్టర్ వారీగా అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముంబయి, భుసావల్, పుణె, నాగ్‌పూర్, షోలాపూర్ క్లస్టర్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ముంబై క్లస్టర్: 

క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్), వాడి బండర్- 258 పోస్టులు
కల్యాణ్ డీజిల్ షెడ్- 50 పోస్టులు
కుర్లా డీజిల్ షెడ్- 60 పోస్టులు
సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కల్యాణ్- 124 పోస్టులు
సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కుర్లా- 180 పోస్టులు
పరేల్ వర్క్‌షాప్- 303 పోస్టులు
మాతుంగ వర్క్‌షాప్- 547  పోస్టులు
ఎస్‌ & టీ వర్క్‌షాప్, బైకుల్లా- 60 పోస్టులు

భుసావల్ క్లస్టర్: 

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 122
ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్- 80
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్- 118
మన్మాడ్ వర్క్‌షాప్- 51
టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్- 47

పుణె క్లస్టర్: 

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 31
డీజిల్ లోకో షెడ్- 121
ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్- 40

నాగ్‌పుర్ క్లస్టర్:

ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని- 48
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 63
ఎంఈఎల్‌పీఎల్‌ ఏజేఎన్‌ఐ- 33

షోలాపూర్ క్లస్టర్: 

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 55
కుర్దువాడి వర్క్‌షాప్- 21

పలు ట్రేడుల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్ ట్రేడుల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 11

స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.7000 ఇస్తారు.

వయస్సు: 2025 ఆగస్టు 12 నాటికి 15 నుంచి 24  ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ట్రైనింగ్ పీరియడ్: వన్ ఇయర్ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు, తదితర ఆధారంగ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

నోటిఫిషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://rrccr.com/Home

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2418

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 11

ALSO READ: Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

Related News

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

Big Stories

×