E-Paper
Advertisement

CISF : సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

CISF : సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

CISF : సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కానిస్టేబుల్ క్యాడర్ లో డ్రైవర్‌, డ్రైవర్‌-కమ్‌-పంప్‌-ఆపరేటర్‌.. ఫైర్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 451 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు 10 తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అభ్యర్థులకు హెవీ మోటార్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. దీంతోపాటు డ్రైవింగ్ లో మూడేళ్ల అనుభవం ఉండాలి. ఫిజికల్‌ స్టాండర్ట్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయడానికి ఫిబ్రవరి 22 ఆఖరి తేది.

కానిస్టేబుల్‌(డ్రైవర్‌) : 183 పోస్టులు (జనరల్-76, SC-27, ST-13, OBC-49, EWS-18)
కానిస్టేబుల్‌/ డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ (ఫైర్‌ సర్వీస్‌) : 268 పోస్టులు (జనరల్-111, SC-40, ST-19, OBC-72, EWS-26)
అర్హత : మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత+ మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం
ఎంపిక : ఫిజికల్‌ స్టాండర్ట్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్ ఆధారంగా
శారీరక ప్రమాణాలు : ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.
వయసు : 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి : లెవెల్‌-3 రూ.21,700 – రూ.69,100.
దరఖాస్తు రుసుం : రూ.100 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 22-02-2023

వెబ్‌సైట్‌: https://cisfrectt.in/index.php

Tags

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×