BigTV English

Taraka Ratna : తారకరత్నకు ఆ వ్యాధి ఉందా?.. అందువల్లే చికిత్స కష్టమవుతోందా.. ?

Taraka Ratna : తారకరత్నకు ఆ వ్యాధి ఉందా?.. అందువల్లే చికిత్స కష్టమవుతోందా.. ?

Taraka Ratna : తీవ్రమైన గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న అరుదైన వ్యాధి మెలినాతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయనకు చికిత్స అందించడంలో వైద్యులకు సవాళ్లు ఎదురుతున్నాయని సమాచారం. అసలు ఈ వ్యాధి ఏంటి ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి.? రోగిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆ విషయాలు తెలుసుకుందాం..


వ్యాధి లక్షణాలు..
జీర్ణాశయంలో రక్తస్రావం జరగడాన్ని మెలినా వ్యాధిగా పేర్కొంటారు. సాధారణంగా మెలినా వల్ల ఎగువ జీర్ణాశయాంతర మార్గంలో రక్తస్రావం జరుగుతుంది. అలాగే నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న పేగు మొదటి భాగంలో బ్లీడింగ్ అవుతుంది.‌ కొన్నిసార్లు పెద్ద పేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వల్ల దీర్ఘకాలంలో ఎగువ జీర్ణాశయాంతర మార్గం దెబ్బ తింటుంది. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయి. రక్త నాళాల్లో వాపు సంభవిస్తుంది. బాధితులకు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. నోటి నుంచి రక్తం పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాదు. రోగికి ఒక్కోసారి రక్తపు వాంతులు అవుతాయి.

వ్యాధి ప్రభావాలు..
మెలినా వల్ల మలం నల్లగా, జిగురుగా వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. మెలినా వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి బలహీనపడతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం లేత రంగులోకి మారిపోతుంది. మెలినా ఉన్న వ్యక్తులు త్వరగా అలసిపోతారు. విపరీతమైన చెమటలు పడతాయి. ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. సరిగ్గా కుప్పంలో తారకరత్న విషయంలో ఇదే జరిగింది. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న చాలాసేపు అలసటిగా కనిపించారు. ఆ తర్వాత ఒక్కసారి కుప్పకూలి గుండెపోటుకు గురయ్యారు. అందువల్లే తారకరత్న శరీరం రంగుమారింది. ఇదంతా మెలినా వ్యాధి ప్రభావం వల్లే జరిగిందని వైద్యులు చెబుతున్నారు.


చికిత్స ఇలా..
మెలినా వ్యాధి ఉన్నవారు పెప్టిక్‌ అల్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. బాధితులకు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్‌ ఎంబలైజేషన్‌, సర్జికల్‌ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు.

తారకరత్న విషయంలో ఏం జరుగుతోంది?
మెలినా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. ముక్కు, చెవులతోసహా అనేక చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు వస్తుంది. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఉపయోగిస్తారు. తారకరత్నకు మెలినా ఉండటంతో చికిత్స అందించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో తారకరత్నకు తొలుత బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నించారు. ఎక్మో మెషిన్ సాయంతో చికిత్స అందించారు. మెలినా దుష్ప్రభావాలు తారకరత్న చికిత్సకు ప్రధాన శత్రులుగా మారాయి. అందువల్లే ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×