Exim Bank: నిరుద్యోగులకు శుభవార్త. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ, బీటెక్, బీఈ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఎగ్జిమ్ బ్యాంక్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
ఎగ్జిమ్ బ్యాంక్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. మేనేజ్ మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ – 22
డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్ / స్కేల్ జూనియర్ మేనేజ్‌మెంట్ I) – 05
చీఫ్ మేనేజర్ (గ్రేడ్ / స్కేల్ మిడిల్ మేనేజ్‌మెంట్ III) – 01
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బీటెక్/బీఈ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: మార్చి 22
అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థలు ఎగ్జిమ్ బ్యాంక్ వెబ్‌సైట్ eximbankindia.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 40 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. చీఫ్ మేనేజర్ ఉద్యోగానికి రూ.85,920 నుంచి రూ.1,05,280 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.eximbankindia.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎగ్జిమ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. ప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. చీఫ్ మేనేజర్ ఉద్యోగానికి రూ.85,920 నుంచి రూ.1,05,280 వేతనం ఉంటుంది. మార్చి 22న దరఖాస్తు గడువు ముగియనుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 28
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 15
ALSO READ: CSIR-CRRI Jobs: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. రూ.81,000 జీతం