RCB VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల ( Royal Challengers Bangalore vs Gujarat Titans ) మధ్య కీలక ఫైట్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ( M.Chinnaswamy Stadium, Bengaluru ) జరిగిన… బిగ్ ఫైట్ లో… బెంగుళూరు ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తు అయింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు పై… గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. ఈ దెబ్బకు వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడుకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో రెండు వికెట్ నష్టపోయి ఛేదించింది గుజరాత్ టైటాన్స్.
Also Read: NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?
బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండు విభాగాల్లో కూడా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్లో ఒక్క మిస్టేక్ లేకుండా.. గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణించింది. ఈ తరుణంలోనే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రానిస్తే.. బ్యాటింగ్లో సాయి సుదర్శన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఇద్దరు దుమ్ము లేపారు.
దుమ్ము లేపిన సాయి సుదర్శన్, జోస్ బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. అలాగే జోష్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. చివరలో రూథర్ఫర్డ్ కొత్త ఆటగాడు 18 బoతుల్లో 30 పరుగులు చేసి… బెంగళూరుకు చుక్కలు చూపించాడు. ఈ దెబ్బకు 17 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది గుజరాత్ టైటాన్స్.
Also Read: Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
పాయింట్స్ టేబుల్ లో RCB కి బిగ్ షాక్
వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కు బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడవ స్థానానికి పడిపోయింది. అటు మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది. ఇక నాలుగవ స్థానంలో ఇవాళ గెలిచిన గుజరాత్ టైటాన్స్ నిలవడం జరిగింది. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కింది నుంచి మూడవ స్థానంలో కొనసాగుతోంది.