DSSSB Recruitment 2025: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 2025లో 2,119 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 8, 2025 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 7, 2025 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు dsssbonline.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత ఎటువంటి దరఖాస్తులను స్వీకరించరు.
వివిధ రంగాల్లో ఉద్యోగాలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో టీచింగ్, టెక్నికల్, సైంటిఫిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జీతాలు పోస్టుల ఆధారంగా రూ. 19,900 నుండి రూ. 1,51,100 వరకు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పోస్టులు:
– PGT ఇంగ్లీష్ (పురుషులు & మహిళలు)
– PGT సంస్కృతం (పురుషులు & మహిళలు)
– PGT ఇంజనీరింగ్ గ్రాఫిక్స్
– PGT హార్టికల్చర్ (పురుషులు)
– PGT అగ్రికల్చర్ (పురుషులు)
– మలేరియా ఇన్‌స్పెక్టర్
– ఆయుర్వేద ఫార్మసిస్ట్
– ఫార్మసిస్ట్ (ఆయుర్వేద)
– అసిస్టెంట్ టెక్నీషియన్
– లాబొరేటరీ టెక్నీషియన్ (ఢిల్లీ జల్ బోర్డ్)
– సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ & మైక్రోబయాలజీ)
– వార్డర్ (పురుషులు మాత్రమే)
మిగిలిన ఖాళీలు, అర్హతల వివరాలు DSSSB అధికారిక వెబ్‌సైట్ dsssb.delhi.gov.inలో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు
– జనరల్,OBC అభ్యర్థులకు: రూ. 100
– మహిళలు, SC, ST, PwBD, అర్హత ఉన్న ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు
– ఫీజు ఆన్‌లైన్‌లో SBI e-pay ద్వారా మాత్రమే చెల్లించాలి
– చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు
దరఖాస్తు ఎలా చేయాలంటే..
1. అధికారిక వెబ్‌సైట్ https://dsssbonline.nic.inని సందర్శించండి.
2. మొదటిసారి దరఖాస్తు చేస్తున్నవారు “New Registration”పై క్లిక్ చేయండి.
3. మీ లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వండి.
4. వ్యక్తిగత, విద్యా మరియు ప్రొఫెషనల్ వివరాలను నమోదు చేయండి.
5. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు మరియు ఫోటోలను అప్‌లోడ్ చేయండి.
6. మీరు దరఖాస్తు చేయదలచిన పోస్టు(ల)ను ఎంచుకోండి.
7. ఫీజు (వర్తిస్తే) SBI e-pay ద్వారా చెల్లించండి.
8. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించి.. భవిష్యత్తు ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి.
ముఖ్యమైన సూచనలు
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ప్రతి పోస్టు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. పరీక్ష తేదీలు త్వరలో DSSSB వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి. పరీక్షలు, అడ్మిట్ కార్డులు.. ఫలితాలకు సంబంధించిన అన్ని సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వివరణాత్మక నోటిఫికేషన్‌లు, డిపార్ట్‌మెంట్‌ల వారీ నిబంధనల కోసం dsssb.delhi.gov.inని సందర్శించండి.