E-Paper
Advertisement

DSSSB Recruitment: అక్షరాల రూ.1,51,000 జీతం.. డిగ్రీ అర్హతతో భారీగా జాబ్స్, పూర్తి వివరాలు ఇవే..

DSSSB Recruitment: అక్షరాల రూ.1,51,000 జీతం.. డిగ్రీ అర్హతతో భారీగా జాబ్స్, పూర్తి వివరాలు ఇవే..
Advertisement

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 216 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ నుంచి పట్వారీ వరకు వివిధ ర కాల పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 216

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్) కీలకమైనవి. వీటితో పాటు రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 వంటి విభిన్న ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యార్హత:

Advertisement

ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అసిస్టెంట్ మేనేజర్ టూరిజం విభాగానికి మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా తప్పనిసరి. అకౌంట్స్ పోస్టులకు సీఏ లేదా సీఎంఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. లీగల్ విభాగానికి ఎల్‌ఎల్‌బీ చదివిన వారు అర్హులు. పట్వారీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రేడియో గ్రాఫర్ అభ్యర్థులకు సైన్స్ గ్రూపుతో ఇంటర్ తోపాటు రేడియోగ్రఫీలో డిప్లొమా లేదా బీఎస్సీ ఉండాలి.

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు లభిస్తుంది.

జీతం:

ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి గరిష్టంగా రూ.1,51,100 వరకు వేతనం అందుతుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులను టైర్-1, టైర్-2 రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షల్లో నెగటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. కొన్ని ప్రత్యేక పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీల వివరాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పించడానికి 2026 మార్చి 28 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది.

అధికారిక వెబ్‌సైట్ https://dsssbonline.nic.in సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని అదికారులు చెబుతున్నారు.

ALSO READ: UPSC CIVILS Results: సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×