BigTV English

Telugu Movies: థియేటర్లు ఏమో ఖాళీ.. కానీ, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ మీట్స్

Telugu Movies: థియేటర్లు ఏమో ఖాళీ.. కానీ, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ మీట్స్

Telugu Movies: ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది అని చాలామంది ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం. ఓటీటీ అనేది ఎంత ఫామ్‌లోకి వచ్చినా కూడా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలని ఇంకా థియేటర్లకు వెళ్తున్నవారు ఉన్నారు. ఎంతైనా కోవిడ్‌కు ముందు, కోవిడ్‌కు తర్వాత థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది అన్నది మాత్రం నిజం. అయినా కూడా మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ మీట్స్ పెట్టేస్తున్నారు మేకర్స్. దీనిపై ఇప్పుడు ప్రేక్షకుల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు థియేటర్లకు ఖాళీగా ఉంటే సినిమాలు హిట్ అంటూ సక్సెస్ మీట్స్ ఎలా పెడుతున్నారు అంటూ చర్చించుకుంటున్నారు.


ఇదేం లాజిక్.?

తాజాగా వీకెండ్‌లో రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో ‘ఓదెల 2’ ఒకటి కాగా మరొకటి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో చాలానే కష్టపడింది. మా సినిమా బాగుంటుంది అంటే మా సినిమా బాగుంటుంది అంటూ పోటాపోటీగా ప్రమోషన్స్ చేసింది. కానీ మొదటిసారి ఆదివారం రోజు హైదరాబాద్‌లో ఒక్క థియేటర్ కానీ, ఒక్క షో కానీ హౌస్‌ఫుల్ కాలేదు. అలాంటిది ‘ఓదెల 2’, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీమ్స్ మాత్రం తమ తమ సినిమాలు సక్సెస్ అంటూ సక్సెస్ మీట్స్ కూడా పెట్టేస్తున్నారు. అసలు ఈ లాజిక్ ఏంటో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.


అసలు నిజం ఇదే

బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు బెటర్ అని, అందులోనూ తెలుగు సినిమాలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయని మూవీ లవర్స్ అనుకుంటున్నారు. కానీ నిజానికి చాలావరకు తెలుగు సినిమాలకు కూడా అంతగా సక్సెస్ లభించడం లేదు. ఈ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడం లేదు. కేవలం భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్‌ను కాపాడుతున్నాయి. కానీ యంగ్ హీరోలు, ఫ్రెష్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు అంతగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు అయితే పూర్తిగా సక్సెస్‌ను అందుకునే పరిస్థితి లేదు అని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పేరుకు అర్థం ఏంటో తెలుసా.?

భారీ స్టేట్‌మెంట్స్

ఈవారం విడుదలయిన ‘ఓదెల 2’ (Odela 2), ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi).. ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు జోనర్లకు చెందినవి. ఒకటేమో తమన్నా మొదటిసారి శివశక్తి పాత్రలో కనిపించిన హారర్ థ్రిల్లర్ అయితే మరొకటి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ. ముందుగా ‘ఓదెల 2’ విషయానికొస్తే.. ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూసి ప్రేక్షకులు షాకవుతారని దీనికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంపత్ నంది స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ ఏమో తన సినిమా మంగళవారం లోపు బ్రేక్ ఈవెన్ సాధించడం పక్కా అని అన్నాడు. కానీ ఆదివారం థియేటర్లలో ప్రేక్షకులు లేకపోవడం చూస్తుంటే ఈ సినిమాల పరిస్థితి ఏంటో నిపుణులకు అర్థమవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×