Engine Driver Jobs: ఏడో తరగతి పాసై ఉన్న అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.. ఫిక్సిడ్ టర్మ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13వ తేదీని దరఖాస్తు గడువు ముగియనుంది.
నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. కేరళ రాష్ట్రం, కొచ్చిలోని ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.. ఫిక్స్ డ్ టర్మ్ ప్రాతిపదికన సెరాంగ్, ఇంజిన్ డ్రైవర్, పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో సెరాంగ్, ఇంజిన్ డ్రైవర్, లాస్కర్ (ఫ్లోటింగ్ క్రాఫ్ట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో..
సెరాంగ్ పోస్టుకు సంబంధించి 9 పోస్టులున్నాయి.
ఇంజిన్ డ్రైవర్ పోస్టుకు సంబంధించి 1 పోస్టు వెకెన్సీ ఉంది.
లాస్కర్(ఫ్లోటింగ్ క్రాఫ్ట్) పోస్టుకు సంబంధించి 1 పోస్టు వెకెన్సీ ఉంది.
విద్యార్హత: ఏడో తరగతి పాసై ఉండాలి. సంబంధిత పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్ కూడా కలిగి ఉంటే సరిపోతుంది.
జీతం: నెలకు నెలకు సెరాంగ్, ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.23,300, రెండో ఏడాది రూ.24,000, మూడో ఏడాది రూ.24,800; లాస్కర్ పోస్టులకు మొదటి సంవత్సరం రూ.22100, రెండో సంవత్సరం రూ.22,800; మూడో సంవత్సరం రూ.23,400 వేతనం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేది నాటికి 30 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ అభ్యర్థులకు అయితే ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగం ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి రూ.200 చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేది: ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనే అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ సంప్రందించండి.
Also Read: Unemployment: రేవంత్ సర్కార్ జర్రంతా మమ్ముల్ని యాది తెచ్చుకోండ్రి.. ఆ ఒక్కటి చేయకండి..!
ఎవరికైతే అర్హత ఉందో వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఏడో తరగతి అర్హతతో కాబట్టి ఇది మంచి అవకాశం. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.
అఫీషియల్ నోటిఫికేషన్: http://https//cochinshipyard.in/
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరితేది: 2025 ఫిబ్రవరి 13
దరఖాస్తు ఫీజు: రూ.200
వయస్సు: 30 ఏళ్లు మించరాదు(ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు)
ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.