BigTV English

Flight Charges: విమాన ధరలకు రెక్కలు.. కళ్లు మూసుకుంటున్న ప్రభుత్వం, కుంభమేళాపై భారీ ఎఫెక్ట్!

Flight Charges: విమాన ధరలకు రెక్కలు.. కళ్లు మూసుకుంటున్న ప్రభుత్వం, కుంభమేళాపై భారీ ఎఫెక్ట్!

Maha Kumbh 2025 Flight Charges: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి వరకు కొనసాగనున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఏకంగా 40 కోట్లకు పైగా మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు యూపీ సర్కారు భావిస్తున్నది. ఈ వేడుకల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లను నడుపుతున్నది.


చుక్కలు చూపిస్తున్నవిమాన టికెట్ల ధరలు

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ కు వెళ్లే విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ఆయా విమానయాన సంస్థలు టికెట్ల ధరలు ఏకంగా 500 శాతం పెంచాయి. పలు ట్రావెల్ సర్వీస్ యాప్స్ నివేదికల ప్రకారం ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ విమాన టికెట్లు 20 శాతానికి పైగా పెరిగాయి. భోపాల్ నుంచి ప్రయాగరాజ్ కు విమాన ఛార్జీలు గత ఏడాది రూ. 2,977 రూపాయలు ఉంటే, ఇప్పుడు ఏకంగా రూ. 17, 796కు చేరడంతో ప్రయాణీకులు షాక్ అవుతున్నారు. బెంగళూరు- ప్రయాగరాజ్ మధ్య గత ఏడాదితో పోల్చితే ఏకంగా 89 శాతం రేట్లు పెరిగాయి.  అటు అహ్మదాబాద్- ప్రయాగరాజ్ మధ్య నడిచే విమానాల్లోనూ ఛార్జీలు భారీగా పెరిగినట్లు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో వెల్లడించింది. వారణాసి, లక్నో నగరాల నుంచి ప్రయాగరాజ్ కు సైతం భారీగా రట్లు పెరిగాయి. అంతేకాదు, విమాన సర్వీసుల బుకింగ్ సైతం 160 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది.


మౌని అమావాస్య సందర్భంగా మరింత ధరల పెంపు

మౌని అమావాస్య నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ప్రయాగరాజ్ కు తరలి రావడంతో విమానయాన సంస్థలు ఛార్జీలను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణంగా ఢిల్లీ- ప్రయాగరాజ్ నడుమ రూ. 5 వేల లోపు ఉంటుంది. కుంభమేళ పుణ్యమా అని ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ టికెట్ ధర రూ. 31 వేలు పలుకుతోంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి లండన్ కు వెళ్లే టికెట్ ధర కేవం రూ. 24 వేల ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ ఛార్జీల వివరాలను పియూష్ రాజ్ అనే జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమాన ఛార్జీలు తగ్గించాలని ప్రహ్లాద్ జోషి లేఖ

మహా కుంభమేళా  వేళ ప్రయాగరాజ్‌ కు వెళ్లే విమానాల టికెట్ ధరలు తగ్గించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకి లేఖ రాశారు. అధిక విమాన ఛార్జీలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విమాన ఛార్జీల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు మహా కుంభమేళాకు వచ్చేందుకు ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు  DGCA అధికారులు  విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో..

ప్రస్తుత నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి విమాన ఛార్జీలను నియంత్రించే అధికారం లేదు. ఈ నేపథ్యంలో ఆయా విమానయాన సంస్థలు అడ్డగోలుగా ధరలను పెంచుతున్నాయి. గత కొంతకాలంగా విమాన టికెట్ల ధరల అడ్డగోలు పెంపుపై ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

చిల్కూరు బాలాజీ అర్చకుడు తీవ్ర ఆగ్రహం

అటు ప్రయాగరాజ్‌కు వెళ్లే భక్తుల నుంచి విమాన సంస్థలు అధిక ఛార్జీలు వసూళు చేయడం పట్ల చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. భక్తుల సెంటిమెంట్‌ ను  సొమ్ము చేసుకోవడం సరికాదన్నారు. ఈ విషయంపై వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలన్నారు.

Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, మౌని అమావాస్య వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×