Field Officer Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బొటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత ప్రభుత్వ రంగ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన రబ్బర్ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ల ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 40 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రబ్బర్ బోర్డులో ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.
భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన రబ్బర్ బోర్టు నుంచి ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40
రబ్బరు బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: రబ్బర్ బోర్డులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా.. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి వర్క్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకోరు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళ అభ్యర్థులు ఎలాంటి ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 28.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 10 లోపు అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎగ్జామ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
దరఖాస్తు విధానం: రబ్బర్ బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 6 ప్రకారం జీతం ఇవ్వనున్నారు. ఉద్యోగం ఎంపికైన అభ్యర్థులకు రూ.35వేల జీతం ఇవ్వనున్నారు.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి గరిష్ట వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించడి.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruitments.rubberboard.org.in/
Also Read: NTPC Recruitment 2025: 475 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. స్టార్టింగ్ జీతమే అక్షరాల రూ.40,000
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు. అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.