ప్రతి ఒక్కరూ పొద్దున్నే నిద్రలేవగానే రిలాక్స్ గా అవుతూ వేడి వేడి కాఫీ, లేదంటే టీ తాగుతుంటారు. ఇంత కాఫీ కడుపులోకి వెళ్లగానే మానసిక ఆనందం కలుగుతుంది. కొంత మంది లేవగానే కాఫీ తాగకపోతే, రోజంతా ఏదో కోల్పోయినట్లు ఫీలవుతారు. కానీ, తాజా పరిశోధన ప్రకారం.. ఉదయాన్నే కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది. పొద్దున్నే కాఫీ తాగడం వల్ల ప్రశాంతతకు తోడు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందట. అయితే, కాఫీ తాగే సమయాన్ని మార్చడం వల్ల లాభాం కలిగే అవకాశం ఉందంటున్నారు.
మార్నింగ్ కాఫీ తాగడం ఎందుకు మంచిది కాదంటే?
మార్నింగ్ లేవగానే శరీరం బద్దకంగా ఉంటుంది. ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉదంటున్నారు నిపుణులు. మధ్యాహ్నం సమయంలోనూ కాఫీ తాగడం మంచిది కాదంటున్నారు. కార్టిసాల్ అనే హార్మోన్ శరీరంలో ఒత్తిడికి కారణం అవుతుంది. ఉదయం వేళ శరీరంలో అత్యధికంగా కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల కార్టిసాల్ మోతాదుకు మించి ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, కార్టిసాల్ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య గరిష్ట స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ సమయంలో కాఫీ తాగడం మంచిది కాదట.
Read Also: వార్ని.. పిసరంత మందు తాగినా ముప్పే? ఇలాగైతే.. పోతారు, మొత్తం పోతారు!
కాఫీని ఏ సమయంలో తాగితే మంచిది?
శరీరంలో కార్టిసాల్ తక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యే సమయంలో కాఫీ తాగడం మంచిదంటున్నారు నిపుణులు. సాధారణంగా మనిషి శరీరంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల శరీరానికి మంచి జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మనసు ఉత్తేజకరంగా మారుతుందంటున్నారు. ఇక, కాఫీ రోజుకు నాలుగు లేదా ఐదు కప్పుల వరకు తీసుకోవడం ప్రమాదం కాదంటున్నారు. రోజూ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తితో పాటు దృష్టి పెరిగే అవకాశం ఉందంటున్నారు. లైఫ్ లోని చిన్న చిన్న ఆనందాల్లో కాఫీ కూడా ఒకటి అంటున్నారు నిపుణులు.
Read Also:వాలంటైన్స్ డే ఆ రోజు ఆ రిస్క్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలియకపోతే రస్కులు తింటూ కూర్చోవల్సిందే!
కొన్ని బౌద్ధ, ధ్యాన సంప్రదాయాలు కూడా ఇష్టమైన పానీయం రోజూ ఓ కప్పు తాగడం అనేది మనసును ప్రశాంతంగా మార్చుతుందని భావిస్తారు. అంతేకాదు, కుండలో ఒక రకమైన కాఫీ లాంటి పానీయాన్ని తయారు చేసి అందరికీ అందిస్తారు. సో, న్యూరో సైన్స్ ప్రకారం పొద్దున్నే కాఫీ తాగడానికి బదులుగా ఉదయం 9 గంటలకు 11 మధ్య తాగాలి. ఈ సమయంలో తాగితే మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. మరింత ప్రభావంతంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. కాఫీ లవర్స్.. ఇకపై మీరు కాఫీ తాగే టైమ్ ను మార్చుకోండి గురూ!
Read Also: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం