Vanitha Vijay Kumar ..వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar ).. పేరు చెప్తేనే.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అనే మాట వినిపిస్తుంది. ఈమె స్టార్ నటి అయినటువంటి మంజుల (Manjula) కుమార్తె అలాగే మంజుల భర్త విజయ్ కుమార్ (Vijay Kumar) కూడా అందరికీ తెలిసిన నటుడే. అలా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించిన మంజుల – విజయ్ కుమార్ లకి ముగ్గురు కూతుర్లు కాగా, అందులో వనితా విజయ్ కుమార్ పెద్దమ్మాయి. అయితే ముగ్గురిలో పెద్దదైన వనితా విజయ్ కుమార్ ఎన్నోసార్లు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. తాను సంపాదించిన ఆస్తి తనకే ఇవ్వడం లేదని తండ్రి,చెల్లెళ్ల పైనే కేసు పెట్టింది. అయితే అలాంటి వనితా విజయ్ కుమార్ అటు పుట్టింటితో పాటు పెళ్లి చేసుకున్న వారితో కూడా కలిసి ఉండలేక విడిపోయింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోని, విడిపోయిన వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) తాజాగా 4 పెళ్లికి రెడీ అయినట్టు ఒక ఫోటో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ వనితా విజయ్ కుమార్ పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో ? ఇప్పుడు చూద్దాం..
నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్న వనిత విజయ్ కుమార్..
చంద్రలేఖ, దేవి వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఫేమస్ అయింది నటి వనితా విజయ్ కుమార్. ఇక ఈ హీరోయిన్ తెలుగులో కంటే ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల ద్వారానే ఫేమస్ అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదట ఆకాష్,ఆ తర్వాత ఆనంద్ జయరాజన్,పీటర్ పాల్ అంటూ ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్న ఈ హీరోయిన్ గత ఏడాది నాలుగో పెళ్లి చేసుకుంటున్నానంటూ ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.అంతేకాదు ప్రియుడికి ప్రపోజ్ చేసిన ఫోటో షేర్ చేయడంతో అంతా నిజమే అనుకున్నారు. ఇక చివరికి వాళ్లు పెళ్లి చేసుడేట్ రానే వచ్చింది. ఇక అదే రోజు ఆమె పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వనితా విజయ్ కుమార్ ప్రపోజ్ చేసిన ఫోటో సినిమా ప్రమోషన్ కోసం అని తెలిసింది.దాంతో అందరూ షాక్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి వనీనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) నాలుగో పెళ్లికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది వనితా.
ప్రమోషన్ స్టంట్..
ఇక ఆ పోస్టులో ఏముందంటే..”పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమించుకున్నాం.ఆ తర్వాత ఎప్పటికీ కలిసే ఉండాలని పెళ్లి చేసుకున్నాం.. అసలు విద్య,అరుణ్ ప్రపంచంలో ఏం జరిగింది” అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి చాలా మంది ఇది కూడా సినిమా ప్రమోషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ మరోపక్క వనితా పెళ్లికూతురు గెటప్ లో, రాబర్ట్ (Rabort) పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? లేక మళ్లీ పెళ్లి(Malli Pelli) సినిమాలో లాగా క్యూరియాసిటీ పెంచి సినిమాకి ప్రమోషన్స్ చేసుకుంటున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా వనిత షేర్ చేసిన పోస్ట్ మాత్రం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే మరో విషయం ఏమిటంటే ఫిబ్రవరి 14 , 5:55 గంటలకు పెళ్లి అని కూడా షేర్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.