Kissik Talks: ఇప్పటికే బిగ్ టీవీ ఎన్నో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా ఒక కొత్త పోడ్కాస్ట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించనుంది. ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) పేరుతో ఒక తెలుగు పోడ్కాస్ట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది బిగ్ టీవీ. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక మొదటి ఎపిసోడ్‌లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మతో కలిసి సందడి చేసింది హోస్ట్ వర్ష. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి, ఇండస్ట్రీలో కమిట్మెంట్ గురించి, సినీ కెరీర్ గురించి.. ఇలా చాలా విషయాలను ఈ పోడ్కాస్ట్‌లో పంచుకున్నారు అన్నపూర్ణమ్మ.
తాగుడు అలవాటు లేదు
‘‘అడిగేవన్నీ అడుగుతూ భయమేస్తుంది అంటారు’’ అంటూ తన కామెడీతోనే ఎపిసోడ్‌ను నవ్వుతూ ప్రారంభించారు అన్నపూర్ణమ్మ. ఈ పోడ్కాస్ట్‌లో అన్నపూర్ణమ్మ పేరు ఉమా మహేశ్వరి అనే విషయాన్ని రివీల్ చేసింది వర్ష. ఆ తర్వాత ఇప్పటికీ తను అంతే అందంగా ఉండడానికి తను ఎలాంటి ఫుడ్ తింటారో బయటపెట్టారు ఈ సీనియర్ ఆర్టిస్ట్. తనకు ఆల్కహాల్ అలవాటు లేదని, ఒకవేళ తాగితే తలకాయ నొప్పి వస్తుందని అన్నారు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అనే ప్రశ్నకు.. ఈ ప్రపోజల్స్ లైఫ్ అంతా ఉంటాయి అంటూ సమాధానమిచ్చారు. ‘‘నా 13వ ఏట రంగేసుకొని ఇండస్ట్రీకి వచ్చాను’’ అంటూ తన సినీ కెరీర్ గురించి గుర్తుచేసుకున్నారు అన్నపూర్ణమ్మ.
కమిట్మెంట్ అడుగుతారు
కమిట్మెంట్స్ గురించి కూడా తన అభిప్రాయాన్ని బోల్డ్‌గా చెప్పేశారు అన్నపూర్ణమ్మ. ‘‘20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగినవారు కూడా ఇప్పుడు బయటికొచ్చి వాగుతున్నారు. నీ ఆలోచన ఎలా ఉంటుందో చూసేవాడికి కూడా అలాగే ఉంటుంది. నిక్కర్, బనియన్ వేసుకొని వెళ్తున్నావు. సిగ్గులేకుండా చెప్తున్నా.. అలా వెళ్తే కమిట్మెంట్ అడగరా? కమిట్మెంట్ అడగడం కరెక్టా కాదా అని చెప్పడానికి నువ్వెవరు?’’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. కమిట్మెంట్ గురించి అన్నపూర్ణమ్మ ఇలా మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌కు అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైలే కారణమని ఇంతకు ముందు కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు అన్నపూర్ణమ్మ (Annapurnamma).
Also Read: ప్రముఖ తెలుగు ఓటీటీలో భారీగా లేఆఫ్స్.. కారణం ఇదేనా?
తట్టుకోవడం కష్టం
ఇక తన ఫ్యామిలీ గురించి చెప్తూ.. ‘‘ముగ్గురు అక్కాచెల్లెళ్లం. ఒక్క అన్న, తమ్ముడు ఉన్నారు. మా అమ్మ పోయారు, నాన్న పోయారు. నా పాప చనిపోయింది’’ అని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అన్నపూర్ణమ్మ. ‘‘ఎవరైనా లేరని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. వాళ్లు చాలా గుర్తొస్తారు. తెల్లవారుజామున గుర్తొస్తారు. ఏమైనా తినేటప్పుడు గుర్తొస్తారు. వాళ్లకు ఇష్టమైనది మనం తినేటప్పుడు గుర్తొస్తారు’’ అంటూ తన జీవితంలోని చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఇక బ్రాండ్ న్యూ పోడ్కాస్ట్ షో అయిన కిస్సిక్ టాక్స్.. ప్రతీ శనివారం రాత్రి 7 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. దీనిని బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.