BigTV English

Students: డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్ బంపరాఫర్.. ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేయండి?

Students: డిగ్రీ,  బీటెక్ స్టూడెంట్స్ బంపరాఫర్.. ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేయండి?

Students: ఈ తరం విద్యార్థులకు తెలివితేటలు అన్నీఇన్నీకావు. సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి అద్భుతాలు చేయవచ్చు. దీన్ని గమనించిన గూగుల్ సంస్థ, స్టూడెంట్స్‌కు బంపరాఫర్ ఇచ్చేసింది. ఆ అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే దానిపై ఓ లుక్కేద్దాం.


దేశంలోని కాలేజీ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చింది గూగుల్. గూగుల్ అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ జెమినీ 2.5 ప్రో. గూగుల్ ప్రీమియం జెమినీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందుకోవచ్చు. నార్మల్‌గా ఏడాదికి దాదాపుగా రూ 20 వేలు అవుతుంది. 18 ఏళ్లు లేకుంటే అంతకంటే ఎక్కువ వయస్సు గల విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేసింది.

దీనికి సంబంధించి సెప్టెంబర్ 15 వరకు ఛాన్స్ ఉంది. గూగుల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వాటిని నమోదు చేయాలి. విద్యార్థులకు విద్యా పనులను సులభతరం చేయడానికి రూపొందించింది ఈ కాన్సెప్ట్. అందులో వ్యాసాలు రాయడం, కోడింగ్ సమస్యలు పరిష్కారం, పరీక్షలకు రెడీ కావడం, ఉద్యోగ ఇంటర్వ్యూలకు ప్రాక్టీసు చేయడం వంటివి ఉన్నాయి.


దీనివల్ల విద్యార్థులు గూగుల్ ద్వారా అధునాతన ఏఐ మోడల్ వినియోగించుకునేందుకు యాక్సెస్ పొందుతారు. స్టడీ గైడ్‌లను క్రియేట్ చేయడం, కోర్సు నోట్స్ నుంచి ప్రాక్టీస్ టెస్ట్‌లను రూపొందించడానికి సహాయ పడుతుంది. జెమినీ ఏఐ ప్రో కేవలం చాట్ సహాయానికే పరిమితం కాదని, అనేక ఉపయోగకరమైన ఆప్షన్లు ఉన్నాయి.

ALSO READ: జస్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం భయ్యా.. ఈ అర్హత ఉండాలి, లాస్ట్ ఛాన్స్

ఎక్కువ ఆడియో ఓవర్‌వ్యూలు, నోట్‌బుక్‌లు పొందవచ్చు, స్టడీ మెటీరియల్‌ను పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌లో మార్చుకోవచ్చు. గూగుల్ ఉచితంగా 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందించనుంది. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌లో వినియోగించుకోవచ్చు. అకడమిక్ ప్రాజెక్ట్‌లు, రీసెర్చ్ మెటీరియల్, మీడియా ఫైల్‌లను సురక్షితంగా స్టోర్ చేయవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక విద్యా అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఏఐతో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేకునేందుకు ఒక మిషన్. గూగుల్, కాంటార్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. దేశంలో 95శాతం విద్యార్థులు జెమినీ వినియోగం వల్ల ఎక్కువ ఆత్మవిశ్వాసం పొందుతున్నారని తేలింది.

75 శాతం మంది భారతీయులు తమ వ్యక్తిగత జీవితం ఎదుగుదల కోసం కోరుకుంటున్నారని తేలింది. విద్యార్థులకు ఈ అవసరాలను తీర్చడానికి ఇదొక అద్భుత సాధనం అన్నమాట. ఆఫర్‌కు నమోదు చేసుకునే విద్యార్థుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. గూగుల్‌కి చెందిన ఏఐ టెక్నాలజీని విద్యార్థులు ఉచితంగా వాడుకోవచ్చు.

ఆ తరహా అవకాశం ఇదివరకు అమెరికాలో ఉండేది, ఇప్పుడు దేశీయ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అయితే విద్యార్థులు అర్హతలు కలిగివుండాలి. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారై ఉండాలి. భారతీయలై ఉండాలన్నది మరో పాయింట్. కాలేజీలో ఉపయోగించే ఈ-మెయిల్ ఐడీ, వ్యక్తిగత గూగుల్ అకౌంట్, గూగుల్ పేమెంట్స్ ఖాతా ఉండాలి.

గూగుల్ వన్ ద్వారా షీర్‌ ఐడీ ఉపయోగించి తమ స్టేటస్‌ని విద్యార్థులు ధృవీకరించుకోవాలి. యాక్టివ్ గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి వర్తించదు. రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు మాత్రమే.

Related News

Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు

IBPS RRB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..

BEML LIMITED: టెన్త్, ఐటీఐతో భారీగా పోస్టులు.. అక్షరాల రూ.1,60,000 జీతం.. దరఖాస్తుకు మూడు రోజులే సమయం..!

JOBS: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. భారీ వేతనం.. 2 రోజులే గడువు

FOREST BEAT OFFICER: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే చాలు.. ఉద్యోగం మీ సొంతం!

Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Big Stories

×