Nindu Noorella Saavasam Serial Today Episode: బాల్ కోసం రోడ్డు మీదకు వెళ్లిన అంజును రణవీర్ మనిషి కారుతో గుద్దేసి చంపాలనుకుంటాడు. అందుకోసం అంజు వైపు కారులో వేగంగా వస్తుంటాడు. అప్పుడే అంజు కోసం బయటకు వచ్చిన మిస్సమ్మ అది చూసి అంజు అంటూ గట్టిగా అరుస్తూ కళ్లు మూసుకుంటుంది. కారు దగ్గరకు రావడంతో అంజు కూడా అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. లోపల గార్డెన్‌లో ఉన్న పిల్లలు అందరూ కంగారుగా బయటకు పరుగెత్తుకుని వస్తారు. మనోహరి మాత్రం హ్యపీగా ఫీలవుతుంది. ఇంతలో అమర్ కారులో వచ్చి అంజును సేవ్ చేస్తాడు. కారు దిగిన అమర్ అంజు లోపలికి వెళ్లు అని చెప్పగానే.. మిస్సమ్మ అంజును లోపలికి తీసుకెళ్తుంది.
అమర్ కారును వెంబడిస్తాడు. కారులో రౌడీని పట్టుకుని చితక్కొడతాడు. ముఖానికి ఉన్న మాస్క్ తీయబోతుంటే తప్పించుకుని వెళ్లిపోతాడు. అయితే చేతికి ఉన్న బ్రాస్‌లెట్ చూసి రణవీరే అని గుర్తు పడతాడు అమర్. మరోవైపు లోపలికి వెళ్లిన మిస్సమ్మ అంజు నీకేం కాలేదు కదా..? అంటుంది. అమ్ము కూడా మిస్సమ్మ ఏమైంది ఎందుకలా అరిచావు అని అడుగుతుంది. బయటి నుంచి వచ్చిన రాథోడ్ అంజు పాప నీకేం కాలేదు కదా అంటాడు. ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నారు అని అంజు అడుగుతుంది. ఇంతలో అమర్ వచ్చి అంజు నీకేం కాలేదు కదా..? అంటాడు. నాకేం కాలేదు డాడ్ ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది అంజు. ఏం లేదు ఒక్కదానివే రోడ్డు మీదకు రాకూడదని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అమర్.
అంటే బాల్ పడిందని వచ్చాను అని అంజు చెప్తుంటే.. మనోహరి వచ్చి అమర్ ఏమైంది ఎందుకు అంత కంగారుపడుతున్నారు అని అడుగుతుంది. అంజును ఇప్పుడు అటాక్ చేయాలని చూశారు మనోహరి. రణవీర్ మనుషులు ఇంటి చుట్టే తిరుగుతున్నారు మనోహరి. అది రణవీర్ వైఫ్ అని మా అనుమానం అని అమర్ చెప్తాడు. నీకెందుకు అనుమానం వచ్చింది అమర్. అసలు వాళ్లు రణవీర్ మనుషులు అని నీకెలా తెలుసు..? అని అడుగుతుంది మనోహరి. దీంతో మేము రణవీర్ ఫోన్‌ను టాప్ చేస్తున్నాము మనోహరి అని అమర్ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. అతనికి రెగ్యులర్‌గా ఇక్కడి నుంచే కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వెళ్తున్నాయి అని చెప్తాడు అమర్. ఫేక్ ఫ్రూప్స్ తో నెంబర్స్ తీసుకుంటున్నారు. ఆ మాస్క్ దాటి మనిషిని గుర్తించే రోజు దగ్గరలోనే ఉంది అంటూ రాథోడ్ చెప్పగానే మనోహరి మరింత టెన్షన్ పడుతుంది. ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. అంజు నువ్వు ఎవ్వరి పర్మిషన్ లేకుండా బయటకు రావొద్దు అని చెప్పగానే అంజు సరే డాడ్ అంటుంది. అందరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు.
తర్వాత మనోహరి.. రణవీర్‌కు లెటర్ రాస్తుంది. అమర్ నీకు సాయం చేసినట్టు నటిస్తూ.. నీ ఫోన్ నెంబర్ ట్రాప్ చేస్తున్నాడు. నా నెంబర్ తీసివేశాను. నీ నెంబర్ కూడా తీసివేయ్.. ఇక నుంచి మనం నేరుగా కలిసి మాట్లాడుకుందాం అని రాస్తుంది. లెటర్ చదివిన తర్వాత రణవీర్ కోపంతో రగిలిపోతుంటాడు. నా కూతురుని తీసుకెళ్లావు.. తను ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పడం లేదు. నా ఆస్థికి నీ కూతురు వారసురాలైంది.. తనను నీడ కూడా టచ్ చేయనిస్తలేవు.. అమర్ నిన్ను దాటి నీ కూతురిని కిడ్నాప్ చేస్తాను.. నువ్వు చూస్తావు అనుకుంటుండగానే లాయర్ వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం రణవీర్ అని అడుగుతాడు. ఒక్క నిమిషం అమర్ లేటుగా వచ్చినా ఈ పాటికి అంజలి నా కంట్రోల్ లో ఉండేది ఎందుకు ఇన్ని సార్లు ప్రయత్నించినా అంజలిని తీసుకురాలేకపోతున్నాను అంటాడు.
దీంతో లాయరు అంజలిని తీసుకురాలేకపోతున్నావు సరే కానీ ఏ క్షణమైనా పోలీసులు నిన్ను కనిపెట్టేస్తారు అని చెప్తాడు. దీంతో రణవీర్ కోపంగా లేదు లాయరు ఇన్నేళ్లు కష్టపడింది.. ఆగింది ఇప్పుడు జైలుకు వెళ్లడానికి కాదు. నేను జైలుకు వెళ్లకూడదు.. ఏదో ఒకటి చేయ్.. అని చెప్తాడు. లేదు రణవీర్ ఇప్పుడు మనం ఏమీ చేయలేము.. నీ మీద వారెంట్ కూడా ఇష్యూ అయింది.. బెయిల్ కూడా రాదు అని లాయర్ చెప్పగానే.. అయితే నీకు కుదురితే పోలీసులను కొను.. లేదా లాయర్ని, జడ్జిని అందరినీ కొను.. నాకు బెయిల్ కావాలి అంతే.. అర్థం అవుతుందా..? నాకు బెయిల్ కావాలి అంటూ చెప్తాడు. దీంతో లాయరు సరే నేను ట్రై చేస్తాను.. కానీ డబ్బు లక్షల్లో అవుతుంది అని చెప్పగానే ఎంత అయినా పర్వాలేదు అంజలిని కిడ్నాప్ చేసే వరకు నేను బయటే ఉండాలి అంటాడు రణవీర్. సరే అంటూ లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తర్వాత అమర్ ఇంటికి వచ్చిన రణవీర్ కోపంగా అమర్‌ను చూస్తుంటే.. అమర్ కూర్చో అనగానే.. నేను కూర్చుని మాట్లాడటానికి రాలేదు అమర్.. నాకు సమాధానం కావాలి. నా కూతురు దుర్గ ఎక్కడ ఉంది అమర్ అని రణవీర్ అడుగుతాడు. అమర్ షాక్ అవుతాడు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్..? నా అన్ని ప్రశ్నలకు నాకు త్వరలోనే సమాధానం కావాలి అమర్. లేదంటే నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు అరుంధతి గారు దత్తత తీసుకున్న నా కూతురిని నాకు అప్పగించకపోతే నీ మీద కేసు పెట్టి నిన్ను జైలుకు పంపుతాను అంటూ రణవీర్ బెదిరిస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?