Coolie Movie:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraj) ఇప్పటికే పలు చిత్రాలు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు రజినీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ‘సన్ పిక్చర్స్ బ్యానర్’ పై కళానిధి మారన్ (Kalanidhi maran) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఏడుపదుల వయసులో కూడా వరుస యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రజినీకాంత్. అందులో భాగంగానే ‘జైలర్’ సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన.. ఇప్పుడు కూలీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ.. ఆగస్టు 14వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేశారు
ట్రైలర్ తో అంచనాలు పెంచాలనుకుంటున్న లోకేష్..
అంతేకాదు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ ఈ సినిమాకు సంబంధించి నటీనటుల లుక్స్ మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పిన లోకేష్ ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రమోషన్స్ ముగించాలనుకుంటున్నానని.. ఇంతకుమించి ప్రమోషన్స్ అవసరం లేదు అని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి నటీనటుల పారితోషకం కీలకంగా మారింది. ఇందులో చాలా మంది భారీతారాగణం నటిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరి పారితోషకం ఎంత? ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు? అనే విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
కూలీ సినిమాలో భారీతారాగణం..
ఇండియన్ సినిమాలలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ కూడా భాగమైంది. అందులో భాగంగానే రజినీకాంత్ (Rajinikanth), నాగార్జున(Nagarjuna ), అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర (Upendra), పూజా హెగ్డే (Pooja Hegde), శృతిహాసన్ (Shruti Haasan) లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల పూజా హెగ్డే కూడా మోనిక అనే పాటతో స్పెషల్ సాంగ్ చేసి యూట్యూబ్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
ఎవరి పారితోషకం ఎంత అంటే?
ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల పారితోషకం విషయానికి వస్తే ..ఇందులో హీరోగా నటిస్తున్న రజినీకాంత్ ఏకంగా రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రూ.25 కోట్లు, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున రూ.24 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమా కోసం రూ.10 కోట్లు తీసుకుంటూ ఉండగా.. హీరోయిన్గా చేస్తున్న శృతిహాసన్ రూ.4కోట్లు, స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే రూ.2కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం
ఏది ఏమైనా నటీనటుల పారితోషక వివరాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.