NTPC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో బీటెక్, బీఈ పాసైన అభ్యర్థులు అలాగే ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలను నింపేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC-NGEL), ఢిల్లీ ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మే 1వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 182
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..
ఇంజినీర్(ఆర్‌ఈ-సివిల్): 40
ఇంజినీర్(ఆర్‌ఈ- ఎలక్ట్రికల్): 80
ఇంజినీర్(ఆర్‌ఈ- మెకానికల్): 15
ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ- హ్యూమన్ రీసోర్స్): 07
ఎగ్జిక్యూటివ్(ఆర్‌ఈ-ఫైనాన్స్): 26
ఇంజినీర్(ఆర్‌ఈ-ఐటీ): 04
ఇంజినీర్(ఆర్‌ఈ-కాంట్రాక్ట్ మెటీరియల్): 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 1
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ), ఎంఈ, డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీడీఎం, ఎంబీఏ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే 30 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.11లక్షల వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ngel.in/career
అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.11లక్షల వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 182
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 1
ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300