RCF Ltd Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ, ఇంజినీరింగ్ (కెమిస్ట్రీ/ఫిజిక్స్), డిప్లొమా (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలను నింపేందకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద వివిధ కేటగిరీ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 74
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. ఇందులో ఆపరేటర్ ట్రైనీ (కెమికల్), బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్-3, జూనియర్ ఫైర్ మెన్ గ్రేడ్-2, నర్స్ గ్రేడ్ 2, టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు- వెకెన్సీలు:
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 54
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III- 3
జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II- 2
నర్స్ గ్రేడ్ II- 1
టెక్నీషియన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4
టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 2
టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 8
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 5
విద్యార్హత: ఉద్యోగాలను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత విభాగంలో టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఇంజినీరింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిప్లొమా పాసై ఉండాలి అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఫిబ్రవరి 1 నాటికి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు, నర్స్ గ్రేడ్-2 పోస్టులకు 36 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్ల వయస్సు మించరాదు.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ణయించారు. నెలకు ఆపరేటర్/టెక్నీషియన్ ట్రైనీ, నర్స్ గ్రేడ్ II పోస్టులకు రూ.46,300, బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ IIIకు రూ.42,100, జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II ఉద్యోగానికి రూ.37,900 జీతం ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: ముంబై, నాగపూర్
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rcfltd.com
అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 74
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 5
ALSO READ: CISF Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు..