E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 8వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరగనుంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టుల వారీగా ఉన్న సాంకేతిక, క్షేత్రస్థాయి అడ్డంకులను, జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సాగునీటి పథకాలపై ఈ సమీక్షలో సమగ్రంగా చర్చించనున్నారు.

ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. వీటితో పాటు రాజీవ్ భీమా, జవహర్‌లాల్ నెహ్రూ ఎత్తిపోతల పథకాలు, కోయిల్ సాగర్, ప్రియదర్శిని జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకోనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది.సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూసేకరణ (L.A.), పునరావాస (R&R) సమస్యలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ ప్రతినిధులు.. అధికారుల సమన్వయంతో సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ నోట్ రూపొందించారు.

Advertisement

ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐకాడ్ (I&CAD) కార్యదర్శి ఈ. శ్రీధర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC)లు, వివిధ విభాగాల చీఫ్ ఇంజనీర్లు, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఏజెన్సీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే దిశగా ఈ సమావేశం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి వారం ఇటువంటి సమీక్షలు నిర్వహించాలని మంత్రి యోచిస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ కర్ణుడు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×