E-Paper
Advertisement

డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. జీతం రూ.78,390.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ బ్రో

డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. జీతం రూ.78,390.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ బ్రో
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. మెకాన్‌ (MECON) లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ ప్రాజెక్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ తోపాటు మేనేజ్‌మెంట్ రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103

Advertisement

విభాగాల వారీగా వెకెన్సీలు: ఈ నియామక ప్రక్రియలో భాగంగా అడిషనల్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్ వంటి సాంకేతిక విభాగాల్లో ఇంజినీర్లను ఎంపిక చేస్తారు. మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆర్కిటెక్చర్, సేఫ్టీ విభాగాల్లోనూ పోస్టులు కేటాయించారు. అలాగే హెచ్‌ఆర్‌, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్‌) పూర్తి చేసి ఉండాలి. మేనేజ్‌మెంట్ పోస్టులకు పీజీ, ఎంబీఏ లేదా పీజీడీఎం ఉత్తీర్ణత తప్పనిసరి. కొన్ని పోస్టులకు నిర్ణీత కాలం పాటు పని అనుభవం అడిగారు.

Advertisement

వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయసు 50 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులను వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.43,880 నుంచి రూ.78,390 వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఇంటర్వ్యూ ప్లేసెస్: ఇంటర్వ్యూలను దిల్లీ, రాంచీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలను సంస్థ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://careers.meconlimited.co.in/

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 27న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి మే 11 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం మెకాన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ALSO READ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. బంగారం లాంటి భవిష్యత్తు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×