E-Paper
Advertisement

ACB Arrest: ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. ఒకేరోజు ఐదుగురు అరెస్టు.. ఎలా దొరికారంటే?

ACB Arrest: ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. ఒకేరోజు ఐదుగురు అరెస్టు.. ఎలా దొరికారంటే?
Advertisement

ACB Arrest: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకున్న కోర్టు ఉద్యోగులు ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. కోర్టుల్లో కలకలం సృష్టించిన ఈ ఉదంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిస్ట్రిక్ట్​ ప్రిన్సిపల్, సెషన్స్​ కోర్టులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

పాలకుర్తి సాయిచరణ్..​ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్​ సెషన్స్​ కోర్టులో గ్రేడ్ 1 స్టెనోగా పని చేస్తున్నాడు. అతని వద్ద కొమ్ము సునీత, పున్నం రజితలు సహోద్యోగులు. ఓ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్​ కాపీ కావాలని ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ కాపీ ఇవ్వటానికి సాయిచరణ్​, సునీత, రజితలు లంచం డిమాండ్ చేశారు.

ముగ్గురికి రిమాండ్ విధింపు

Advertisement

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు శుక్రవారం మాటు వేసి సాయిచరణ్​, సునీత, రజితలు 5వేల రూపాయలను లంచంగా తీసుకోగానే దాడి చేసి రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి వరంగల్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్​ విధించటంతో ముగ్గురిని జైలుకు తరలించారు.

సబ్ రిజిస్ట్రార్ సైతం..

మరో ఘటనలో సబ్​ రిజిస్ట్రార్​ తోపాటు అతనికి సహకరించిన ప్రైవేట్​ డాక్యుమెంట్ రైటర్​ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాసర్లీ రాజేందర్​ సబ్​ రిజిస్ట్రార్​ గా పని చేస్తున్నాడు. కాగా, కొంత భూమిని కొన్న ఓ వ్యక్తి దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి వచ్చాడు. ఆఫీస్​ బయట ప్రైవేట్​ డాక్యుమెంట్ రైటర్​ గా పని చేస్తున్న రషీద్ ను కలవాలని సూచించటంతో భూమి రిజిస్ట్రేషన్ కోసం అతన్ని కలిశాడు.

రెడ్ హ్యాండెడ్‌గా..

Advertisement

ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే సబ్​ రిజిస్ట్రార్​ కు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుందని రషీద్ చెప్పాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు నిందితులను పట్టుకునేందుకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయానికి వచ్చారు. రషీద్ లంచం డబ్బు రూ. 16,500 తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో సబ్​ రిజిస్ట్రార్​ రాజేందర్​ చెప్పినందుకు డబ్బు తీసుకున్నానని రషీద్ వెల్లడించాడు.

Also Read: TG High Court: సంధ్యా థియేటర్​ తొక్కిసలాట ఘటన.. హైకోర్టులో మళ్లీ అదే రిపీట్

లంచం డిమాండ్​ చేస్తే..

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్​ విధించటంతో ఇద్దరిని జైలుకు తరలించారు. కాగా అధికారులు ఎవరైనా లంచం డిమాండ్​ చేస్తే 1064 నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీడీ డీజీపీ చారు సిన్హా సూచించారు. దాంతోపాటు 9440446106 నెంబర్​ కు వాట్సాప్ చేయవచ్చన్నారు.

Also Read: Vijay Rashmika wedding: విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు ఇచ్చిన గిఫ్ట్ ఇవే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×