Hyderabad Metro Rail: ప్రయాణీకుల నుంచి భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకున్నది. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కొత్త రైళ్లకు ఆర్డర్ ఇచ్చినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే 18 నెలల్లో 10 రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో 57 మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నట్లు తెలిపిన ఆయన, 10 రైళ్లు అందుబాటులోకి వస్తే, ఈ సంఖ్య 67కు చేరనుంది. కొత్త రైళ్లు వచ్చే వరకు ఉన్న రైళ్లతోనే రద్దీగా ఉన్న కారిడార్లలో ఫ్రీక్వెన్సీ పెంచి నడుపుతామని తెలిపారు.
భారత్ లోనే కొత్త కోచ్ ల తయారీ!
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ‘మీ టైమ్ ఆన్ మై మెట్రో’ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈవెంట్ ను ఎల్ అండ్ టీ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘మీ టైమ్ ఆన్ మై మెట్రో’ స్మార్ట్ కార్డును ఎన్వీఎస్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో కోచ్‌లన్నీ సౌత్ కొరియాలోని హ్యూందయ్ రోటెమ్ కంపెనీ తయారు చేసిందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ఇకపై మనదేశంలోనే తయారు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. వారితో ఇప్పటికే చర్చలు జరిగాయని తెలిపారు.
రోజుకు 7 లక్షల మంది ప్రయాణం
ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మెట్రో రైళ్ల ద్వారా ప్రతి రోజు 7 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ లో రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం రద్దీని తగ్గించేందుక షార్ట్ లూప్ లో మెట్రో రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.
Read Also: భారీ సంఖ్యలో వందేభారత్ రైళ్ల తయారీ.. మొత్తం ఎన్ని రైళ్లు రానున్నాయంటే?
100 ఎకరాల్లో మెట్రో హబ్ ఏర్పాటు
అటు 50 నుంచి 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి మెట్రో హబ్ ను ఏర్పాటు చేయాలని ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మార్గంలో హెచ్‌ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్లు, ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని ప్లై ఓవర్లను నిర్మిస్తున్న ఆయన.. వీటిని పరిగణలోకి తీసుకొని సమగ్ర ప్రణాళికతో నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. రెండో దశ మెట్రోలో భాగంగా ఇప్పటికే 5 మెట్రో కారిడార్లకు డీపీఆర్ రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. ఈ 5 కారిడార్లతో పాటు మరో 3 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిపారు. అనుమతులు రాగానే ఏప్రిల్ నాటికి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారన్నారు. మరోవూపు ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్- శామీర్ పేట కారిడార్లను కలిపి నిర్మించడం ద్వారా మెగా జంక్షన్ గా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించినట్లు ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Read Also: షూటింగ్స్‌తోనూ ‘వందేభారత్’ రైళ్ల సంపాదన.. అప్పుడే ఎంత పారితోషికం వచ్చిందో తెలుసా?