WTC Cycle 2025-27 Schedule: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 2025 టోర్నమెంటులో టీమిండియా కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ టోర్నమెంటులో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా… ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా… మూడు మ్యాచ్లు ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముఖ్యంగా.. బుమ్రా రూపంలో టీమిడియాకు ఎదురు దెబ్బ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా లేడనే ధైర్యంతో భారత్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఊదేసింది. ప్రసిద్ధి కృష్ణ ఎంతో ప్రయత్నించినప్పటికీ టార్గెట్ చిన్నది కావడంతో ఆస్ట్రేలియా సిడ్ని మ్యాచ్ ను గెలిచింది.
Also Read: Chahal wife with iyer: చాహల్ తో విడాకులు.. అయ్యర్ తో ధనశ్రీ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!
పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ కరెక్ట్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఉన్న టీమిండియా మూడవ రోజు ఉదయం 157 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో లభించిన నాలుగు పరుగుల లీడ్ తో కలిపి ఆస్ట్రేలియాకు 162 పరుగుల టార్గెట్ ని మాత్రమే పెట్టగలిగారు. కెప్టెన్ స్టార్ పెసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మ్యాచ్ లోకి దిగకపోయాడు.
దీంతో భారత్ ను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి ఓవర్ నుంచి ఎదురు దాడి మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఈ క్రమంలోనే 58 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయినప్పటికి ఎటాక్ చేయడం ఏమాత్రం ఆపలేదు. ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీసిన జస్ప్రీత్ బుమ్రా లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదే అడ్వాంటేజ్ గా హెడ్ టీం చెలరేగిపోయి ఆడి ఆసిస్ కు కావలసిన లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆస్ట్రేలియా ఖాతాలో ఈ సిరీస్ లో మూడవ విజయం పడి 3-1 తేడాతో పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకుంది.
Also Read: Kohli new bat: విరాట్ కోహ్లీ కొత్త బ్యాట్.. ఇక ఔట్ చేయడం సాధ్యం కాదట!
చివరిసారిగా 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ను ధోని కెప్టెన్సీలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఇంటా బయట ఆసిస్ ను చిత్తు చేసిన భారత్ వరుసగా నాలుగు సార్లు బీజీటీ సిరీస్ ను సొంతం చేసుకున్న ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు.
ఇది ఇలా ఉండగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 అలాగే 2027 సైకిల్ కు సంబంధించిన భారత షెడ్యూల్ కూడా ఆ ఖరారు అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన షెడ్యూల్… వైరల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇందులో భాగంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడనుంది టీం ఇండియా. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం నవంబర్ అలాగే డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా తో తలపడబోతోంది.
ఇక 2026 ఆగస్టు మాసంలో శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. 2026 అక్టోబర్ మాసంలో… అలాగే నవంబర్ లో న్యూజిలాండ్ తో రెండు టెస్టులు ఉంటాయి. 2027 జనవరి అలాగే ఫిబ్రవరిలో… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మళ్ళీ ఐదు టెస్టులు ఆడనుంది టీమిండియా.