TGPSC Exams: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం శుభవార్త చెప్పారు. ఈ ఏడాది లో వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇకపై టీజీపీఎస్సీ నిర్వహించే పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామని ఆయనన్నారు. పరీక్ష నిర్వహించే 6 నెలల లోపే ఫలితాలు ఇచ్చే విధంగా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా గ్రూప్-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. వీలైనంత త్వరలోనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. యూపీఎస్సీ, ఫార్మాట్‌లలో పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలన్నీ విడుదల చేస్తామన్నారు.
Also Read: AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000
ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి ముందుగా ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరి ఫలితాల విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ సిలబస్ పై అధ్యయనం చేస్తున్నామని, గ్రూప్ -2, గ్రూప్-3 పరీక్షలకు మూడు నుంచి నాలుగు పేపర్లు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రూప్స్ పరీక్షలకు పేపర్లను కుదించే పనిలో ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ షురూ చేస్తే ఉద్యోగం సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అభ్యర్థుల్లారా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఉద్యోగం సాధించిండి. ఆల్ ది బెస్ట్.