BigTV English

Game Changer Twitter Review: ‘గేమ్ ఛేంజర్’ ట్విటర్ రివ్యూ.. లైవ్ అప్డేట్స్

Game Changer Twitter Review: ‘గేమ్ ఛేంజర్’ ట్విటర్ రివ్యూ.. లైవ్ అప్డేట్స్

Game Changer Twitter Review: శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ను వెండితెరపై చూడడానికి ఫ్యాన్స్ దాదాపుగా మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను దాటుకొని ఈ మూవీ ప్రేక్షకులను ముందుకు వచ్చేసింది. మునుపటి పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ‘గేమ్ ఛేంజర్’ బెనిఫిట్ షోకు టికెట్ ధరలు తగ్గడంతో చాలామంది ఈ షోలను చూడడానికి వెళ్లారు. బెనిఫిట్ షోలు చూసిన వెంటనే వారి రివ్యూలను ట్విటర్‌లో అందించారు. మామూలుగా సోషల్ మెసేజ్ సినిమాలు చేయడంలో శంకర్‌కు సెపరేట్ మార్క్ ఉంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ను కూడా అదే తరహాలో తెరకెక్కించి పాజిటివ్ రివ్యూలు అందుకుంటున్నారు.


‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్‌గా గడిచిపోయినా సెకండ్ హాఫ్‌లో వచ్చిన అప్పన్న క్యారెక్టర్ సినిమాను సేవ్ చేసిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’లో ‘ధోప్’ పాట కోసం మేకర్స్ విపరీతంగా ఖర్చుపెట్టగా అదంతా వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుందని ఆడియన్స్ అంటున్నారు.

చాలావరకు ‘గేమ్ ఛేంజర్’కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నా ఇది రొటీన్ స్టోరీ అని కొందరు ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

తమిళ వర్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీమియర్ షో చూసేసిన ఒక నెటిజన్.. దీనిపై డీటైల్డ్ రివ్యూ అందించారు.

‘గేమ్ ఛేంజర్’లో విజిల్ కొట్టే మూమెంట్స్ అసలు లేవని, చాలా బోరింగ్ ఉందని ఓవర్సీస్ ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు.

‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ లుక్స్ మామూలుగా లేవని చెప్తూ తన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ అస్సలు నచ్చని ప్రేక్షకులు.. ఇది ‘గేమ్ ఛేంజర్’ కాదు.. ‘గేమ్ ఓవర్’ అంటున్నారు.

ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించే మాస్ మసాలా ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని బెనిఫిట్ షో చూసిన ఫ్యాన్స్ అంటున్నారు.

సినిమాలో కొన్ని సీన్స్ మరీ క్రింజ్‌లాగా ఉన్నాయని ప్రేక్షకులు నెగిటివ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ అస్సలు నచ్చని కొందరు ప్రేక్షకులు.. ఫస్ట్ హాఫ్‌కు కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు.

శంకర్ తమిళ దర్శకుడు కాబట్టి ‘గేమ్ ఛేంజర్’ను తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేశారని కూడా చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

తమన్ మ్యూజిక్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి మార్కులే పడుతున్నాయి.

‘గేమ్ ఛేంజర్’ సెకండ్ హాఫ్ మొదలవ్వగానే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చే హై సీన్ ఉందని ఒక నెటిజన్ రివీల్ చేశాడు.

కొందరు రామ్ చరణ్ యాక్టింగ్‌ను ఎస్ జే సూర్య యాక్టింగ్‌తో పోలుస్తూ.. ‘గేమ్ ఛేంజర్’లో అసలైన హీరో ఎస్ జే సూర్యనే అని అంటున్నారు.

‘గేమ్ ఛేంజర్’లో హీరో రామ్ చరణ్, విలన్ ఎస్ జే సూర్య ఎదురుపడిన సీన్స్ మాత్రం ప్రేక్షకులకు వేరే లెవెల్ హై ఇస్తాయట.

మామూలుగా శంకర్ సినిమాల్లో పాటలు వేరే లెవెల్‌లో ఉంటాయి. అలాగే ‘గేమ్ ఛేంజర్’లో కూడా పాటలు మామూలుగా లేవని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

కొందరు ప్రేక్షకులు అయితే సినిమా చూసిన వెంటనే స్పాయిలర్స్ ఇస్తూ.. ట్విస్టులు కూడా రివీల్ చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’లో సునీల్, వెన్నెల కిషోర్ లాంటి కామెడియన్స్ కూడా ఉన్నారు. కానీ వారి కామెడీ సినిమాకు ప్లస్ అవ్వడం లేదని ఆడియన్స్ ఫీలవుతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ను విపరీతంగా ఇష్టపడిన ఆడియన్స్ 4 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ లాంటి పొలిటికల్ డ్రామాను తప్పకుండా చూడాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ రికమెండ్ చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ను తప్పకుండా వెండితెరపై చూడమంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

కొందరు ప్రేక్షకులు మాత్రమే వేరే ఏ ఆలోచన లేకుండా ట్విటర్‌కు న్యాయమైన రివ్యూలు ఇస్తున్నారని అనిపిస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ప్రేక్షకులు మాత్రం మూవీ యావరేజ్ అంటూ డీటైల్డ్ రివ్యూ అందిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ అయితే మరీ అంత బాలేకుండా ఏమీ లేదని, ఒకసారి థియేటర్లలో చూసేంత అయితే బాగుందని కొందరు అంటున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×