Job for 10th ITI Candidates: మీరు టెన్త్ క్లాస్ పాసయ్యారా..? ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఈ ఉద్యోగానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLC) ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల సంఖ్య: 7
వివిధ విభాగాల్లో పలు రకాల ఉద్యోగాలున్నాయి. ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్–04, ఎలక్ట్రీషియన్–03 ఉద్యోగాలు ఉన్నారు.
విద్యార్హత: టెన్త్, ఐటీఐ, సంబంధిత విభాగలో ఫుల్ టైం డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. ఉద్యోగ అనుభం కూడా చూస్తారు.
వయస్సు: 30 ఏళ్లు మించరాదు.
జీతం: ఎలక్ట్రికల్ సూపర్ వైజర్ పోస్టుకు సంబంధించి నెలకు రూ.38000, ఎలక్ట్రీషన్‌కు సంబంధించి నెలకు రూ.30,000 వేతనం ఇస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 2024 డిసెంబర్ 30
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్ సైట్: https://www.nlc-india.in